మీ స్కోరెంత?

నటులు, సెలెబ్రిటీలు... ఇలా ఎవరూ క్యాన్సర్‌కి మినహాయింపు కాదు. ప్రముఖ హాలీవుడ్‌ నటి 43 ఏళ్ల ఒలీవియామున్‌ కూడా రొమ్ము క్యాన్సర్‌ బారిన పడి కోలుకుంది. నిజానికి ఆమెకు ఎటువంటి క్యాన్సర్‌ లక్షణాలూ పైకి కనిపించకపోయినా ముందస్తు జాగ్రత్తగా చేయించుకొనే మామోగ్రమీ పరీక్షతో పాటు...

Published : 17 Mar 2024 02:00 IST

నటులు, సెలెబ్రిటీలు... ఇలా ఎవరూ క్యాన్సర్‌కి మినహాయింపు కాదు. ప్రముఖ హాలీవుడ్‌ నటి 43 ఏళ్ల ఒలీవియామున్‌ కూడా రొమ్ము క్యాన్సర్‌ బారిన పడి కోలుకుంది. నిజానికి ఆమెకు ఎటువంటి క్యాన్సర్‌ లక్షణాలూ పైకి కనిపించకపోయినా ముందస్తు జాగ్రత్తగా చేయించుకొనే మామోగ్రమీ పరీక్షతో పాటు... ‘బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌ అసెస్‌మెంట్‌’ ప్రశ్నావళి కూడా వ్యాధి అంచనాకి సహకరించిందని చెప్పుకొచ్చింది. ఈ ప్రశ్నావళి కారణంగా తన చికిత్సకు తగినంత సమయం చిక్కిందనీ, అందువల్లే కోలుకోవడం తేలికైందని చెప్పింది. ఇంతకీ ‘బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌ అసెస్‌మెంట్‌ టూల్‌(బీసీఆర్‌ఏటీ) అంటే ఏంటో చూద్దాం. దీన్నే గెయిల్‌ మోడల్‌ అని కూడా అంటారు. కొన్నిప్రశ్నలు ఆధారంగా అంటే వ్యక్తిగత ఆరోగ్య వివరాలతో పాటు గర్భధారణ వివరాలు, దగ్గరి బంధువుల ఆరోగ్య వివరాలు తెలుసుకుంటారు. మహిళల వయసు, మొదటిసారి నెలసరి వచ్చిన సమయం, మొదటి బిడ్డకు జన్మనిచ్చిన సమయం... తల్లి, చెల్లి, కూతురు వీళ్లలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉందా? మరికొన్ని జన్యు పరీక్షలు, వాటి వివరాల ఆధారంగా క్యాన్సర్‌ని అంచనా వేస్తారు. భవిష్యత్తులో అంటే తొంభై ఏళ్ల వయసులోపు క్యాన్సర్‌ ముప్పును ఈ విధానంలో తెలుసుకోవచ్చు. ఈ ప్రశ్నావళి 5 నిమిషాల్లో పూరించేలా ఉంటుంది. వాటి సమాధానాలు...స్కోర్‌ ఆధారంగా భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్‌ వచ్చేదీ లేనిదీ తెలిసే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్