నాభిలో నూనె వేస్తే...

నాభి భాగంలో రాత్రి సమయంలో నూనె రాసి మర్దన చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

Published : 23 Mar 2024 01:35 IST

నాభి భాగంలో రాత్రి సమయంలో నూనె రాసి మర్దన చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. సంప్రదాయ భారతదేశంలో ఈ పద్ధతిని చిన్నారి పుట్టినప్పటి నుంచి మన అమ్మలు, అమ్మమ్మలు అనుసరించారు. దీనికి కొబ్బరి, బాదం, ఆవనూనెలను ఉపయోగించవచ్చు.

  • రోజూ స్నానం చేసేటప్పుడు నాభిలో కొద్దిగా నూనె వేసి కాసేపాగి శుభ్రం చేయాలి. ఇంకా అల్లం, ఆవ నూనెల మిశ్రమాన్ని నాభి భాగంలో వేసి చుట్టూ ఉండే ప్రాంతాన్ని మర్దన చేయడం వల్ల కడుపునొప్పి, ఉబ్బరం, వికారం తగ్గుతాయి.
  • రాత్రి నిద్రించే ముందు నాభి భాగంలో రెండు చుక్కలు ఏదైనా నూనెను వేయడం వల్ల నెమ్మదిగా పిగ్మెంటేషన్‌ సమస్య తగ్గుతుంది.
  • మారుతున్న జీవనశైలీ, ఆహారపు అలవాట్లూ అనేక అనారోగ్యాలకి దారితీస్తున్నాయి. వాటిలో ఒకటి చిన్న వయసులో కాళ్లనొప్పులు రావడం. కానీ ఈ బెల్లీ బటన్‌ ఆయిలింగ్‌ ద్వారా వీటిని నయం చేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్