వ్యాయామం చేయలేకపోతున్నారా?

ఆడవాళ్లకు ఇంటి పనులు చేసే ఓపిక ఉంటుంది కానీ, వ్యాయామం చేసే తీరిక మాత్రం ఉండదు. ఇందుకు కారణాలేవైనా... ఆచరణలో పెట్టడం మొదలుపెడితేనే కదా ఆసక్తి పెరిగేది. అందుకు ఈ వేసవి కాలం మంచి సమయం అంటారు ఫిట్‌నెస్‌ నిపుణులు.

Published : 27 Mar 2024 01:15 IST

ఆడవాళ్లకు ఇంటి పనులు చేసే ఓపిక ఉంటుంది కానీ, వ్యాయామం చేసే తీరిక మాత్రం ఉండదు. ఇందుకు కారణాలేవైనా... ఆచరణలో పెట్టడం మొదలుపెడితేనే కదా ఆసక్తి పెరిగేది. అందుకు ఈ వేసవి కాలం మంచి సమయం అంటారు ఫిట్‌నెస్‌ నిపుణులు.

  • నిన్న మొన్నటి వరకూ నిద్రలేచీ లేవగానే వంటగదిలోకే వెళ్లాల్సి వచ్చేది కదా! దీంతో ఆ ఒత్తిడి కాస్తా రోజంతా కొనసాగడంతో అలసట, చిరాకు...వంటివెన్నో ఎదురయ్యేవి. వాటన్నింటినీ అదుపు చేయాలంటే వ్యాయామం తప్పనిసరి. పిల్లలకు సెలవులిచ్చాక ఎలానూ కొంత సమయం చిక్కుతుంది కాబట్టి దాన్ని మీకోసం కేటాయించుకోవడానికి మానసికంగా సిద్ధం కండి. ఇందులో భాగంగా మొదట నెమ్మదిగా వీధి చివరి వరకూ ఓ రెండు సార్లు నడిచి రండి. ఆపై కాసేపు టెర్రస్‌ మీద చాప వేసుకుని ప్రశాంతంగా కూర్చోండి. ఇలా కనీసం ఓ వారంపాటు క్రమం తప్పకుండా చేస్తే సరి. ఒత్తిడి తగ్గి చేయాలనుకున్న పనులపై దృష్టి కేంద్రీకరించే తత్వం అలవడుతుంది.
  •  ఆ తరవాత వారం... రోజూ కంటే కాస్త ముందే లేచి ఓ మూడు నాలుగు సార్లు మేడమెట్లు ఎక్కి దిగండి. ఓ అరగంట తోటపని చేయండి. వీధి చివర ఉన్న పార్కుకి వెళ్లి కాసేపు నడవండి. ఇవన్నీ క్రమం తప్పకుండా ఆ ఏడు రోజులూ చేస్తే చాలు... తరవాత ఉత్సాహంగా కొనసాగిస్తారు.
  • పిల్లలతో కలిసి ఎప్పుడైనా ఆడారా? లేదంటే సరదాగా శ్రమనిచ్చే ఆటల్ని వారితో కలిసి ఆడండి. సైక్లింగ్‌ చేయండి. లేదంటే రెసిస్టెంట్‌ బ్యాండ్‌ని వాడి ఆన్‌లైన్‌ వీడియోల సాయంతో చిన్న చిన్న వర్కవుట్లు చేయండి. ఇవన్నీ మీలో కొంత మార్పుని తెచ్చిపెడతాయి. అప్పుడు దగ్గర్లోని యోగా తరగతిలోనో, ఫిట్‌నెస్‌ స్టూడియోలోనో చేరండి. దాన్ని బట్టి మీ రోజువారీ ప్రణాళిక నిర్ణయించుకోండి. ఈ అలవాటు మీ బరువుని తగ్గించడంతో పాటు శక్తినీ, ఆరోగ్యాన్నీ ఇస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్