ఈ పార్కు ప్రత్యేకం

ఫిట్‌నెస్‌ని ప్రేమించే అమ్మాయిలు చకచకా నడుస్తూ ఒకవైపు... స్కూల్‌ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్లతో సరదాగా గడిపే నాయనమ్మలూ, అమ్మమ్మలూ ఇంకోవైపు.

Updated : 05 Mar 2024 13:04 IST

మహిళా లోకం

ఫిట్‌నెస్‌ని ప్రేమించే అమ్మాయిలు చకచకా నడుస్తూ ఒకవైపు... స్కూల్‌ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్లతో సరదాగా గడిపే నాయనమ్మలూ, అమ్మమ్మలూ ఇంకోవైపు. కష్ట, సుఖాలు పంచుకుంటూ తేలికపడే అతివలు మరోవైపు కనిపిస్తారు ఆ పార్క్‌లో. కానీ ఎక్కడా మగవాళ్లు కనిపించరు. అదే ఆ పార్క్‌ ప్రత్యేకత. రాజమహేంద్రవరంలోని ఆర్‌వీ నగర్‌లో ఉన్న ఈ పార్కులో మహిళలకూ, పదేళ్ల లోపు చిన్నారులకూ మాత్రమే ప్రవేశం ఉంది.

మహిళల్లో ఫిట్‌నెస్‌, ఆరోగ్యంపై అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ పార్కును ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. వాకింగ్‌ ట్రాక్‌తో పాటు చుట్టూ మనసుని ఆహ్లాదపరిచేలా బొటానికల్‌ గార్డెన్‌నీ పెంచుతున్నారు. ఇక్కడేకాదు దిల్లీలోనూ మహిళలు సౌకర్యంగా వ్యాయామం చేసుకొనేందుకు వీలుగా పింక్‌ పార్కులు అభివృద్ధి చేస్తున్నారు.

 వి.రామకృష్ణ, రాజమహేంద్రవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్