మార్గదర్శి త్రిపుర సుందరి

ఈ రోజు శ్రీ లలితాత్రిపుర సుందరీ దేవి రూపంలో అమ్మవారు వరప్రదాయినిగా దర్శనమిస్తారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా లలితాదేవిని భక్తులు ఆరాధిస్తారు.

Updated : 10 Oct 2021 05:51 IST

ప్రాతః స్మరామి లలితా వదనారవిందం
బింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్హ్‌
అకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌!!

ఈ రోజు శ్రీ లలితాత్రిపుర సుందరీ దేవి రూపంలో అమ్మవారు వరప్రదాయినిగా దర్శనమిస్తారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా లలితాదేవిని భక్తులు ఆరాధిస్తారు. వాస్తవానికి ఈ రూపం నుంచే మనం ఆరాధిస్తున్న దేవతా రూపాలు దిగివచ్చాయని వ్యాసమహర్షి పురాణాల్లో తెలిపారు. శరీరం, మనసు, బుద్ధి అనేవి త్రిపురాలు. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ శక్తులు కలిగినది లలితాదేవి అంటారు. నేటి మహిళలు పరిజ్ఞానంలో పురుషులకి ఎక్కడా తీసిపోవడం లేదు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు అనే పేరుతో సంసిద్ధత, అవగాహన, నిర్వహణ దక్షత అనే మూడు లక్షణాలను సొంతం చేసుకుని పురోగమించే నేటి మహిళలకి లలితాత్రిపురసుందరి మార్గదర్శి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్