ఈ కాలంలో... వాటికీ కావాలి రక్షణ!

చలి నుంచి రక్షణకి దుస్తుల నుంచి ఉత్పత్తుల వరకు ఎన్నింట్లోనో జాగ్రత్తలు తీసుకుంటాం. మరి ఎంతో జాగ్రత్తగా పెంచుకునే మొక్కల సంగతేంటి? ఈ కాలంలో వాటికీ తగిన రక్షణ అవసరం మరి!

Updated : 11 Nov 2021 06:40 IST

చలి నుంచి రక్షణకి దుస్తుల నుంచి ఉత్పత్తుల వరకు ఎన్నింట్లోనో జాగ్రత్తలు తీసుకుంటాం. మరి ఎంతో జాగ్రత్తగా పెంచుకునే మొక్కల సంగతేంటి? ఈ కాలంలో వాటికీ తగిన రక్షణ అవసరం మరి!
మొక్కల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అంటే.. కుళ్లిపోయిన, ఎండిపోయిన కొమ్మలు, ఆకులు, పువ్వులను తొలగిస్తుండాలి. లేదంటే చలి కారణంగా ఫంగస్‌ ఏర్పడటమో కీటకాలు గుడ్లు పెట్టే ఆవాసాలుగానో మారి పూర్తిగా మొక్క చావుకే కారణమవగలవు. ఈ వ్యాధులు ఇతర మొక్కలకూ వ్యాపిస్తాయి.
* కొన్ని మొక్కలు ముఖ్యంగా కొన్నిరకాల పూల మొక్కలు చల్లగాలిని తట్టుకోలేవు. అలాంటివేమైనా ఉంటే వాటిని రాత్రుళ్లు ఇంట్లోకి మార్చడం మేలు. ఇళ్లలో పెంచే మొక్కలకు ఎక్కువ నీరు అవసరం ఉండదు. తక్కువ మొత్తాన్నే అందించండి. లేదంటే వేర్లు కుళ్లిపోతాయి, లేదా వ్యాధుల బారిన పడతాయి.
* ఫెర్టిలైజర్లను ఈ కాలంలో పక్కన పెట్టొచ్చు. మరీ అవసరం అనుకుంటే నేరుగా కాకుండా నీటిలో కలిపి వాడాలి. ఇండోర్‌ ప్లాంట్లను వీలైనంత ఎక్కువ సేపు ఎండలో ఉంచే ప్రయత్నం చేయండి. కిటికీలు, గ్రిల్స్‌లో ఉండే మొక్కలను రోజూ వాటి దిశను మారుస్తూ ఉంటే వాటి ఎదుగుల సమానంగా సాగుతుందట. పురుగులు, కీటకాల దాడి ఈ కాలంలో ఎక్కువ. వాటినీ గమనించుకుంటూ ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్