ఇల్లు.. చల్లగా..

ఇంట్లోంచి కాలు బయట పెట్టకపోయినా ఎండ వేడి బాధ తప్పడం లేదు. మరేం చేద్దాం? ఇంటికి ఈ చిన్ని మార్పులు చేయండి. ఉపశమనం లభిస్తుంది.

Published : 10 Apr 2022 02:05 IST

ఇంట్లోంచి కాలు బయట పెట్టకపోయినా ఎండ వేడి బాధ తప్పడం లేదు. మరేం చేద్దాం? ఇంటికి ఈ చిన్ని మార్పులు చేయండి. ఉపశమనం లభిస్తుంది.

* మధ్యాహ్న సమయంలో గాలి రావాలని కిటికీలన్నీ తెరిచి ఉంచుతాం కదా! దానివల్ల వేడి పెరగడమే కానీ తరగదు. ఉదయం ఎనిమిది తర్వాత మూసేసి సాయంత్రం ఏడు తర్వాతే తెరవాలి. ముదురు రంగుల్లో ఉండే కాటన్‌ కర్టెన్లు వేసి ఉంచాలి.

* గదుల్లో అనవసరమైన సామాను, ఫర్నిచర్‌, పుస్తకాలు సహా తీసేయండి. పెద్దగా ఉపయోగించని ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఒవెన్‌, మిక్సీ, కంప్యూటర్‌ వంటి వాటిని ప్లగ్‌లు తొలగించి మరీ పక్కన పెట్టండి. ఇవీ వేడిని కలిగించేవే. గదుల్లో బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ, సీఎఫ్‌ఎల్‌ఎస్‌ లైట్లకు ప్రాధాన్యమివ్వాలి.

* ఇంట్లో, కిటికీల్లో మొక్కలను ఏర్పాటు చేసుకుంటే సహజంగా ఇంటిని చల్లబరుస్తాయి. ఇంటికీ అందం, మనసుకీ ప్రశాంతత.

* టేబుల్‌ ఫ్యాన్‌ను ఏర్పాటు చేసుకుని దాని ముందు నీళ్లు లేదా ఐసు ముక్కలతో ఉన్న గిన్నెను ఉంచండి. చల్లని గాలి మీ సొంతమవుతుంది.

* ఈ కాలంలో దొరికే పుచ్చకాయ, మెలన్‌, ద్రాక్ష, నారింజ లాంటి పండ్లు, కీర, దోస, ముల్లంగి వంటి కూరగాయలతోపాటు పుదీనాను ఎక్కువ తీసుకోండి. ఇవి శరీరానికి తగిన నీటిని అందించడమే కాదు.. వేడినీ తరిమేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్