ఇంట్లో అక్వేరియం ఉందా?

గృహాలంకరణలో భాగంగానో, పిల్లలు మనసు పడ్డారనో అక్వేరియాలను కొంటారు. తీరా చేపలకు ఏమైనా అయితే మనసు ఉసూరుమంటుంది. ఇక పిల్లల సంగతైతే చెప్పనక్కర్లేదు. ఎండల ప్రభావం వీటిపై మరింత ఉంటుంది. మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? నీటి ఉష్ణోగ్రత 22- 28 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటేనే చేపలకు అనుకూలం. అంతకన్నా ఎక్కువ ఉంటే వాటికి ఆక్సిజన్‌ స్థాయులు సరిపోవు. పదే పదే నీటి బయటకు వచ్చి ఊపిరి తీసుకుంటుండటం దీనికి

Published : 12 Apr 2022 01:23 IST

గృహాలంకరణలో భాగంగానో, పిల్లలు మనసు పడ్డారనో అక్వేరియాలను కొంటారు. తీరా చేపలకు ఏమైనా అయితే మనసు ఉసూరుమంటుంది. ఇక పిల్లల సంగతైతే చెప్పనక్కర్లేదు. ఎండల ప్రభావం వీటిపై మరింత ఉంటుంది. మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

నీటి ఉష్ణోగ్రత 22- 28 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటేనే చేపలకు అనుకూలం. అంతకన్నా ఎక్కువ ఉంటే వాటికి ఆక్సిజన్‌ స్థాయులు సరిపోవు. పదే పదే నీటి బయటకు వచ్చి ఊపిరి తీసుకుంటుండటం దీనికి చిహ్నమే. ఈ ఇబ్బంది పెరిగితే చనిపోతాయి. మధ్యాహ్న సమయాల్లో పై మూతను తీసి ఉంచండి. నీరు కాస్త చల్లబడటంతోపాటు ఎక్కువ ఆక్సిజన్‌ అందే వీలుంటుంది.

చేపలు కదిలే తీరు బాగా కనిపించాలని లైట్లు పెడుతుంటాం కదా! పగలు వాటిని తీసేయడం మంచిది. కొన్ని గంటలకోసారి చల్లటి నీరు కలుపుతుండాలి. అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాక కొద్ది కొద్దిగా కలపాలి. టేబుల్‌ ఫ్యాన్‌ను ఫిష్‌ ట్యాంకు ముందు ఉంచినా మంచిదే.

సూర్య కిరణాలు నేరుగా పడని ప్రదేశంలో దీన్ని ఉంచాలి. చేపలు పెరిగేకొద్దీ వాటికి ఎక్కువ ఆహారాన్ని అందించాలి. నిజమే! కానీ అది అతి అయినా ప్రమాదమే. మిగిలిపోయిన వాటి ఆహారం, విసర్జితాలు ఈ కాలంలో త్వరగా విషతుల్యమవుతాయి. కాబట్టి రోజుకు 2, 3 సార్లు కొద్ది మొత్తంలో ఆహారం ఇవ్వండి. తరచూ నీటిని మారుస్తూ ఉండండి.

ట్యాంకులో పవర్‌ ఫిల్టర్లను ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇవి నీరు కదిలేలా చేస్తాయి కాబట్టి, ఆక్సిజన్‌ స్థాయులు పెరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్