Published : 06/03/2023 00:15 IST

గోమయం.. పర్యావరణ హితం

పర్యావరణహిత వస్తువుల తయారీతో పాటు గోవుల సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నారు జగిత్యాల జిల్లా బోర్నపల్లి మహిళలు. అక్కడి గోదావరి తీరంలో మురళీధార గోధామం ఏర్పాటు చేసి.. వీటిని తయారు చేస్తున్నారు. దీనికి ఆద్యురాలు డా.చెన్నమనేని పద్మ. 180 గోవులతో ఐదేళ్ల క్రితం.. మురళీధార గోధామం ఏర్పాటు చేశారామె. గ్రామంలోని గిరిజనులకు ఉపాధి కల్పిస్తూ ఆవుపేడతో ప్రమిదలు, పిడకలు, సబ్బులు, దూప్‌స్టిక్‌, సేంద్రియ ఎరువుల తయారీ, విగ్రహాలు, అలంకరణ సామగ్రి, అగరుబత్తులు మొదలైనవి తయారు చేసి అమ్ముతున్నారు. పర్యావరణ రక్షణతోపాటు ఉపాధినీ పొందుతున్న వీళ్లు ఆదర్శమే కదూ!

- శ్రీనివాస్‌, కరీంనగర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని