దోమలు.. దూరమిలా..
చినుకులు పడ్డాయంటే చాలు.. వచ్చేస్తాయండీ దోమలు. కానీ రసాయనాలుండే మస్కిటో రెపల్లెంట్స్ పిల్లల్లో శ్వాస సంబంధ సమస్యలు, కొన్నిసార్లు అలర్జీలకూ కారణమవుతాయి.
Published : 02 Aug 2023 00:01 IST
చినుకులు పడ్డాయంటే చాలు.. వచ్చేస్తాయండీ దోమలు. కానీ రసాయనాలుండే మస్కిటో రెపల్లెంట్స్ పిల్లల్లో శ్వాస సంబంధ సమస్యలు, కొన్నిసార్లు అలర్జీలకూ కారణమవుతాయి. సహజమైన వాటికోసం చూస్తున్నారా?
- ముప్పావుకప్పు కొబ్బరినూనెకు పదిహేను చుక్కల పెప్పర్‌మెంట్ ఆయిల్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్లకు రాసుకుంటే సరి. చర్మాన్ని తేమగా ఉంచడమే కాదు.. దోమలను దరిచేరనివ్వదు. సువాసన మనసుకీ ప్రశాంతతను ఇస్తుంది.
- పావు కప్పు చొప్పున నీరు, యాపిల్ సిడార్ వెనిగర్ తీసుకొని ఆ మిశ్రమానికి రెండు స్పూన్ల రోజ్‌మెరీ లేదా లావెండర్ నూనెను కలపాలి. దీన్ని ఓ స్ప్రే బాటిల్‌లో పోసుకొని ఉంచుకోవాలి. దుస్తుల మీదా లేదా గదిలో కావాల్సినప్పుడు బాటిల్‌ని బాగా కుదిపి స్ప్రే చేస్తే సరి.
- దోమలకు యూకలిప్టస్ వాసన పడదని తెలుసా? పావుకప్పు లెమన్ గ్రాస్ లేదా టీట్రీ ఆయిల్‌ని తీసుకోవాలి. దానికి మూడు స్పూన్ల యూకలిప్టస్ నూనె కలిపి ఉంచుకోవాలి. దుస్తులపై అక్కడక్కడా చుక్కలుగా పెట్టుకుంటే సరిపోతుంది.
- కప్పు నీటికి అరచెక్క నిమ్మరసం, మూడు స్పూన్ల వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్, 10 చుక్కల లావెండర్ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ స్ప్రే బాటిల్‌లో పోసి, గదిలో స్ప్రే చేస్తే సరి. వీటిలోని యాసిడ్ గుణాలు దోమలను దరిచేరనీయవు.
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.