గ్యాస్‌ స్టవ్‌తోనూ సమస్యే..!

ఉదయం లేచిన దగ్గర నుంచీ సాయంత్రం వరకూ మన ఇంట్లో గ్యాస్‌ స్టవ్‌ వెలుగుతూ ఉండాల్సిందే. అయితే, గ్యాస్‌ స్టవ్‌ వెలిగించి, వంటచేసేటప్పుడు దాన్నుంచి వెలువడే నానో పార్టికల్స్‌ మనకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగించే ప్రమాదం ఉందని పర్‌డ్యూ యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో తేలింది.

Updated : 09 Mar 2024 05:28 IST

దయం లేచిన దగ్గర నుంచీ సాయంత్రం వరకూ మన ఇంట్లో గ్యాస్‌ స్టవ్‌ వెలుగుతూ ఉండాల్సిందే. అయితే, గ్యాస్‌ స్టవ్‌ వెలిగించి, వంటచేసేటప్పుడు దాన్నుంచి వెలువడే నానో పార్టికల్స్‌ మనకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగించే ప్రమాదం ఉందని పర్‌డ్యూ యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో తేలింది. అధిక సంఖ్యలో గాల్లోకి విడుదలయ్యే ఈ నానో పార్టికల్స్‌ మనలో, ముఖ్యంగా పిల్లల్లో ఆస్తమా లాంటి అనేక రకాల జబ్బులకు కారణమవుతున్నాయట. ఈ ప్రయోగం కోసం ఓ చిన్న ఇంటిని ఏర్పాటు చేసుకుని, అందులో రోజువారీ పనులు చేశారట. ఇంట్లో సెన్సార్లను అమర్చి, గాలి నాణ్యతను నిశితంగా పరిశీలించారట. కారు పొగగొట్టం నుంచి విడుదలయ్యే కాలుష్యం కంటే 10-100 రెట్లు ఎక్కువగా ఏరోసాల్‌ నానో క్లస్టర్స్‌ ఈ మంట వల్ల విడుదలవుతాయట. కంటికి కనిపించని ఇవి, శ్వాసకోశ వ్యవస్థలోకి తేలిగ్గా చేరి, వాటి పనితీరుని దెబ్బతీస్తాయట. కేవలం 20 నిమిషాలు నీళ్లు మరిగిస్తే చాలు... ట్రిలియన్ల కొద్దీ పరమాణువులు బహిర్గతమవుతాయట. అందుకే వంట చేసేటప్పుడు ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ను తప్పనిసరిగా ఆన్‌ చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అది లేని సమయంలో వంట గదిలోకి గాలీ, వెలుతురూ వచ్చేలా చూసుకోవాలి. లేదా విండో ఫ్యాన్‌, ఎయిర్‌ ఫిల్టర్‌ లాంటివి ఉపయోగిస్తే మేలు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్