అతిథులను స్వాగతించే... అందమైన టేబుళ్లు!

ఎందెందు వెతికినా అందందు నీవే అన్నట్లు... ఇంట్లో ప్రతి గదికీ సరిపోయే, ఎలా కావాలంటే అలా మార్చుకునే వస్తువు ఒకటి ఉంటే ఎలా ఉంటుంది? బావుంటుంది కదా! అయితే కన్సోల్‌ టేబుల్‌ తెచ్చేసుకోండి. అదేనండీ ఇంటి అలంకరణలో ఉపయోగించే టేబుల్‌. కన్సోల్‌ అనే పదం ‘కన్సాలిడేట్‌’ అనే ఫ్రెంచ్‌ పదం నుంచి వచ్చిందట. అంటే... బలపరచడమని అర్థం.

Published : 11 Mar 2024 02:29 IST

ఎందెందు వెతికినా అందందు నీవే అన్నట్లు... ఇంట్లో ప్రతి గదికీ సరిపోయే, ఎలా కావాలంటే అలా మార్చుకునే వస్తువు ఒకటి ఉంటే ఎలా ఉంటుంది? బావుంటుంది కదా! అయితే కన్సోల్‌ టేబుల్‌ తెచ్చేసుకోండి. అదేనండీ ఇంటి అలంకరణలో ఉపయోగించే టేబుల్‌. కన్సోల్‌ అనే పదం ‘కన్సాలిడేట్‌’ అనే ఫ్రెంచ్‌ పదం నుంచి వచ్చిందట. అంటే... బలపరచడమని అర్థం. మొదటగా వీటిని 17వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో వాడేవారట. అప్పట్లో అర్ధ చంద్రాకారంలో, రెండు కాళ్లతోనే ఉండే ఇవి... క్రమేపీ నాలుగు కాళ్లతో, రకరకాల ఆకృతుల్లో, మరిన్ని హంగులతో మార్కెట్లోకి వచ్చేశాయి. వినియోగదారుల అవసరాలకు తగినట్లు మినిమలిస్టిక్‌, ఇండస్ట్రియల్‌, రస్టిక్‌, మోడర్న్‌, సంప్రదాయ రకాల్లో ఇప్పుడు వీటిని తయారు చేస్తున్నారు.

ఇల్లు, ఆఫీసుల్లో ఎక్కడైనా పెట్టేయొచ్చు. చిన్న చిన్న ఖాళీ ప్రదేశాల్లోనూ చక్కగా ఒదిగిపోయే ఇవి అదనపు స్టోరేజీలానూ ఉపయోగపడతాయి. వాటికే కొంచెం సృజనాత్మకత జోడించి, వాల్‌ఆర్ట్‌, అద్దం లాంటి వాటి కింద ఉండేట్లు అమర్చితే చాలు. గదికి సరికొత్త కళ వస్తుంది. బయటకు వెళ్లేటప్పుడూ, వచ్చేటప్పుడూ తాళంచెవి, వాలెట్స్‌, బ్యాక్‌ప్యాక్స్‌ లాంటివి ఎక్కడంటే అక్కడ పడేయకుండా వీటిలో పెట్టేయొచ్చు. అలమరాలు ఉండే టేబుల్స్‌ని ఎంచుకుంటే, షూ ర్యాక్స్‌గానూ ఉపయోగపడతాయి. వాటిమీద ల్యాంప్‌లనూ ఉంచి, లివింగ్‌ రూమ్‌లో సైడ్‌ టేబుల్‌లా, టీవీ స్టాండ్‌లానూ మార్చేసుకోవచ్చు. ఈ టేబుల్‌ ముందు ఒక కుర్చీ వేసుకుని డ్రెస్సింగ్‌ టేబుల్‌ లేదా స్టడీ టేబుల్‌లానూ ఉపయోగించొచ్చు. వీటిని చెక్క, ప్లాస్టిక్‌, గాజు, మార్బుల్‌, లెదర్‌, స్టోన్‌... వంటి రకరకాల మెటీరియళ్లతో తయారుచేస్తున్నారు. ఇవి మన వ్యక్తిత్త్వానికి చిహ్నాలుగానే కాదు, ఇంట్లో షో పీస్‌లుగానూ ఉపయోగపడతాయి. అంటే అందంతో పాటు ప్రయోజనం కూడా. మీకూ నచ్చాయా.. అయితే ఆన్‌లైన్లో వెదికేయండి. ఇంటికి కొత్తశోభను తెచ్చేయండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్