జేడ్‌ని పెంచేద్దామా!

పచ్చలు పొదిగినట్లుగా మెరిసిపోయే జేడ్‌ని చూసి ముచ్చటపడని వారుండరేమో! ఈ సక్యులెంట్‌ని ఇండోర్‌ ప్లాంట్‌గా, ఆర్నమెంటల్‌ రకంగానే కాదు... గిఫ్టింగ్‌ కోసమూ ఎంచుకోవచ్చు.

Published : 12 Mar 2024 01:22 IST

పచ్చలు పొదిగినట్లుగా మెరిసిపోయే జేడ్‌ని చూసి ముచ్చటపడని వారుండరేమో! ఈ సక్యులెంట్‌ని ఇండోర్‌ ప్లాంట్‌గా, ఆర్నమెంటల్‌ రకంగానే కాదు... గిఫ్టింగ్‌ కోసమూ ఎంచుకోవచ్చు. దీన్ని పెంచుకోవడమెలాగో తెలిస్తే మరింత బాగుంటుంది కదా!

కాంతి అవసరం: ఇవి పెరిగే వాతావరణంలో తగినంత వెలుతురు ఉండాలి. కనీసం రోజులో గంటైనా తగిలేలా చూసుకోవాలి. పశ్చిమం, దక్షిణం వైపు ఉండే కిటికీల దగ్గర వీటిని అనువుగా పెంచుకోవచ్చు. గది మరీ చీకటిగా ఉంటే ఎల్‌ఈడీ కాంతులైనా ప్రసరించేలా చూసుకోవాలి.

నీళ్లు పోయాల్సిందే: మట్టిలో తేమ నిలబడితేనే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. అలాగని మరీ బురదబురదగా ఉండకూడదు సుమా! ఈ నీటిని నింపుకొనే ఆకులు పచ్చగా ఉంటాయి. మొక్క చుట్టూ మట్టి గట్టిపడకుండా ఎప్పటికప్పుడు వదులు చేసుకోవడమూ ముఖ్యమే. అప్పుడే వేళ్లకూ గాలి తగిలి ఆరోగ్యంగా ఎదుగుతుంది.

పోషకాలు ఇస్తేనే: ఎంత ఎడారి మొక్క అయినా...తగినన్ని పోషకాలు అందిస్తేనే చక్కగా ఎదుగుతుంది. దీనికి కనీసం నెలకోసారైనా నీళ్లలో కరిగే ఎన్‌పీకే ఎరువుని అందించాలి. చనిపోయిన, పాడైన కొమ్మల్ని ఎప్పటికప్పుడు తీసేయాలి. ఇలా చేస్తేనే జేడ్‌ ఆకులతో నిండుగా కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్