పచ్చని మొక్కకు చల్లని నీడ...

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇంటి తోటను సిద్ధం చేసుకోవాలి. అసలే రానున్నదంతా వేసవి కాలం. వేడి గాలుల నుంచి మొక్కల్ని ఎలా కాపాడుకోవాలంటే...

Published : 13 Mar 2024 01:34 IST

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇంటి తోటను సిద్ధం చేసుకోవాలి. అసలే రానున్నదంతా వేసవి కాలం. వేడి గాలుల నుంచి మొక్కల్ని ఎలా కాపాడుకోవాలంటే...

  • నేల తేమను కోల్పోకుండా మొక్కల చుట్టూ గడ్డి, కొబ్బరిపొట్టు వంటి మల్చ్‌ను మందపాటి పొరలా ఏర్పాటు చేయాలి. ఇది మట్టిలో తేమను నిలిపి ఉంచి వాడిపోనివ్వకుండా చేస్తుంది. కలుపు మొక్కలనూ పెరగనివ్వదు. మల్చింగ్‌ గట్టిపడిన ప్రతిసారీ గుల్లచేసి కొద్దిగా కొత్తది వేస్తూ ఉండాలి.
  • మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఎండ ఎంత అవసరమో, అవసరానికి మించిన ఎండ కూడా అంతే హానికరం. అందువల్ల ఎండ తీవ్రత నుంచి మొక్కలను రక్షించాలి. వీలైతే ఇంటి తోట చుట్టూ గ్రీన్‌షేడ్‌ నెట్‌ వేస్తే సరి. లేదంటే గాలీ వెలుతురూ అందేలా కాస్త ఎత్తులో ఆకుల పందిరి వేసినా మేలే.
  • గాలి ప్రసరణను మెరుగుపరచడానికి, శిలీంధ్ర వ్యాధులను నివారించడానికీ ప్రూనింగ్‌ చాలా అవసరం. ఎండిన, చనిపోయిన కొమ్మలను తొలగించడం వల్ల కొత్తచిగుళ్లు వస్తాయి. వేడిగాలులకు మట్టి త్వరగా పొడిబారుతుంది. నీరు వేళ్ల చివరి వరకు తడిచేలా రోజూ రెండుసార్లు అందించాలి.
  • ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... అప్పుడప్పుడు చీడపీడలు వేధిస్తుంటాయి. ఇలాంటప్పుడు వేపనూనె, వెల్లుల్లి రెబ్బలను దంచి నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఉదయం వడకట్టి మొక్కలపై స్ప్రే చేయాలి. వెల్లుల్లికి క్రిమికీటకాలతో పోరాడే గుణాలు ఉన్నందున త్వరగా తెగుళ్లను అరికడుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్