Published : 18/07/2021 00:42 IST

మెనోపాజ్‌కు సిద్ధమేనా?

మహిళల్లో మెనోపాజ్‌ దశ సర్వసాధారణం. ఇది 40ల చివర్లో మొదలవుతుంది. ఈ సమయంలో హార్మోన్లలో వచ్చే తేడాల కారణంగా భావోద్వేగాల్లో మార్పులు, శారీరక ఇబ్బందులూ వస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ దశను సులువుగానే ఎదుర్కోవచ్చంటున్నారు నిపుణులు.
తినాల్సినవి: * ఈస్ట్రోజన్‌ స్థాయులు తగ్గుతాయి. కాబట్టి ఎముకల్లో బలం తగ్గుతుంది. కాబట్టి, విటమిన్‌ డి, కె, క్యాల్షియం, ఫాస్ఫరస్‌ ఉండే పాలు, పాల సంబంధిత పదార్థాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎముకలు బలంగా ఉండటానికి ప్రొటీన్‌ అవసరం. ఇందుకు గుడ్లు, చికెన్‌, చేపలను తీసుకోవాలి.
* గోధుమ, బ్రౌన్‌ రైస్‌, బార్లీ, క్వినోవాల్లో ఫైబర్‌, బి విటమిన్‌ ఎక్కువ. ఫైబర్‌ ఆరోగ్యంగా ఉంచితే, బి విటమిన్‌ ఉత్సాహంగా ఉంచడంతోపాటు అలసటను తగ్గిస్తుంది. పండ్లూ, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించడంతోపాటు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. గుండెనీ ఆరోగ్యంగా ఉంచుతాయి.
* నువ్వులు, అవిసెలు, బీన్స్‌ల్లో ఫైటోఈస్ట్రోజన్‌ ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
వీటికి దూరం: ప్రాసెస్‌డ్‌, కారం, తీపి, కెఫిన్‌ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్ని పదార్థాలతో భావోద్వేగాల్లో మార్పులు, వేడి చేయడం వంటివి కనిపిస్తాయి. అవేంటో గమనించుకుని, దూరంగా ఉండాలి. ఇంకా.. రోజూ కొద్దిసేపు నడవాలి. విపరీతమైన ఆందోళన, కోపం వంటి సూచనలు కనిపిస్తే వైద్యుణ్ని సంప్రదించాలి. ఈ సమయంలో బరువు పెరిగే అవకాశమూ ఉంటుంది. అందువల్ల ఆరోగ్యకర ఆహారానికే ప్రాధాన్యమివ్వాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి