ఇలా ప్రారంభించండి!

చాలామంది ఉద్యోగినులు వృత్తిలో ఉన్నతంగా ఎదగాలనుకుంటారు. అందుకు తగినట్లు ఎక్కువ గంటలు పని చేస్తూ కష్టపడతారు కూడా. అయినా అనుకున్న స్థాయిలో విజయాలను సాధించలేకపోతారు.

Updated : 19 Oct 2022 16:03 IST

చాలామంది ఉద్యోగినులు వృత్తిలో ఉన్నతంగా ఎదగాలనుకుంటారు. అందుకు తగినట్లు ఎక్కువ గంటలు పని చేస్తూ కష్టపడతారు కూడా. అయినా అనుకున్న స్థాయిలో విజయాలను సాధించలేకపోతారు. వారు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఈ వైఫల్యాలు. మరి మీరూ అలా చేయకుండా దినచర్యను ఎలా ప్లాన్‌ చేసుకోవాలో తెలుసుకుందామా...

గాఢంగా శ్వాస తీసుకోండి..

చాలామంది ఆదరాబాదరాగా పని మొదలుపెడుతుంటారు.  ఇంటి నుంచి పనిచేసేవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లు లేవడమే ఆఫీసు మొదలయ్యే సమయానికి మరి. ఆఫీసుకు వచ్చే ఉద్యోగుల తిప్పలు మరో రకంగా ఉంటాయి. ట్రాఫిక్‌ జామ్‌, ఇతర ఇంటి పనులు.... ఇలా ఉంటాయి. వాటితో సతమతమవుతూ కార్యాలయానికి వచ్చిన ఉద్యోగులు తొందర తొందరగా పనులు పూర్తి చేయాలనుకుంటారు. మీరూ అలా చేయకండి. ఆఫీసుకు వచ్చాక రెండు నిమిషాలపాటు ప్రశాంతంగా కూర్చొండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. ఆ తర్వాత పని మొదలుపెట్టండి.

ఖాళీ మెదడుతో...

జరిగిపోయిన దాని గురించి బాధ, ఆందోళనలు పడకుండా ఈ రోజు ఏం చేయాలో అనేది మాత్రమే ఆలోచించండి. నిన్న జరిగిన ప్రతికూల అంశాలన్నింటినీ బుర్ర నుంచి ఖాళీ చేయండి.  ఈ రోజు చేసే పనులపై వందశాతం దృష్టి పెట్టండి.

పోషకభరిత అల్పాహారం..

ఇంటి నుంచి పనులు చేస్తున్నా, ఆఫీసుకు వెళుతున్నా ఖాళీ కడుపుతో ఉండకూడదు. తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ చేయాల్సిందే. ఇది పోషకభరితంగా ఉండేలా చూసుకోవాలి. అల్పాహారం అనేది రోజులో చాలా ముఖ్యమైన మీల్‌. ఇది మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు రెట్టించిన ఉత్సాహాన్నిచ్చి పనులు పూర్తయ్యేలా చేస్తుంది.

పక్కా ప్రణాళికతో...

ఆ రోజు ఏమేం పనులు చేయాలో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలో... ఓ చోట రాసుకోవాలి. ఇందుకోసం దాదాపు అరగంట కేటాయించుకోవాలి. అన్ని పనులను ప్రాధాన్య క్రమంలో రాసుకోవాలి. దానికి అనుగుణంగా ఒక్కోటి పూర్తి చేసుకుంటూ పోతే సరి. సామాజిక మాధ్యమాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మెయిల్స్‌కు కూడా పరిమిత సమయాన్ని పెట్టుకుంటే సరి.

చలాకీగా...

మీకు ఎన్ని ఇబ్బందులున్నా.. పరిస్థితులు బాగాలేకపోయినా, కిందటి రోజు రాత్రి సరిగా నిద్రపోయకపోయినా... ఇలా ఎన్ని సమస్యలున్నా ఆఫీసులో మాత్రం చాలా అలెర్ట్‌గా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్