కొత్త కొలువా.. నిబంధనలు తెలుసుకున్నారా?

జానకి ఉద్యోగంలో చేరినప్పుడు ఫార్మాల్టీ అని చెప్పడంతో కొన్ని పత్రాలపై పెట్టిన సంతకం ఆమెను అక్కడే పదేళ్లపాటు ఉండేలా చేసింది. ఇబ్బందులున్నా ఉద్యోగం నుంచి బయటకు వెళ్లకూడదనే నిబంధనని గుర్తించలేదామె. కెరియర్‌లో అడుగుపెట్టేటప్పుడు సంస్థ నియమ

Published : 04 Jul 2022 00:52 IST

జానకి ఉద్యోగంలో చేరినప్పుడు ఫార్మాల్టీ అని చెప్పడంతో కొన్ని పత్రాలపై పెట్టిన సంతకం ఆమెను అక్కడే పదేళ్లపాటు ఉండేలా చేసింది. ఇబ్బందులున్నా ఉద్యోగం నుంచి బయటకు వెళ్లకూడదనే నిబంధనని గుర్తించలేదామె. కెరియర్‌లో అడుగుపెట్టేటప్పుడు సంస్థ నియమ నిబంధనలపై దృష్టి ఉంచి మరీ ముందుకెళ్లాలంటున్నారు నిపుణులు.

ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఆ సంస్థకు సంబంధించిన వివరాలను సేకరించాలి. స్థాయులబట్టి అక్కడ లభించే వేతనాలు, అదనపు సౌకర్యాలతోపాటు ఉద్యోగంలో చేరితే పాటించాల్సిన నియమాలనూ తెలుసుకోవాలి. ఆన్‌లైన్‌లో సదరు సంస్థ అభివృద్ధి గురించి అవగాహన తెచ్చుకోవాలి. అక్కడ చేరితే వ్యక్తిగతంగా కెరియర్‌లో అభివృద్ధి ఎలా ఉంటుందో ఆ సంస్థలో పనిచేసిన అనుభవం ఉన్నవారిని అడిగి తెలుసుకోవాలి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఫలానా సంస్థకు ఇంటర్వ్యూకెళ్లినప్పుడు ఎదురైన ప్రశ్నల నుంచి అక్కడ చేరిన తర్వాత ఎదురైన అనుభవాల వరకు పొందుపరుస్తున్నారు. అలా అవగాహన పొందే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

అప్రమత్తంగా..

ఏ సంస్థలోనైనా చేరేముందు అక్కడ నిబంధనలు, నియమాలను తెలుసుకోవడానికి వెనుకాడకూడదు. దాంతోపాటు సంతకాలు పెట్టాల్సిన పత్రాలను ఓపిగ్గా ఒకసారి మొత్తం చదవడం మరవకూడదు. సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలి. కాంట్రాక్ట్‌ పద్ధతి లేదా కొన్ని సంవత్సరాల అగ్రిమెంట్‌వంటివి ఉన్నాయేమో చూడాలి. ముందుగానే ఈ విధానం ద్వారా ఉద్యోగంలో చేరుతున్నట్లు ఆమోదం ఉంటే ఫరవాలేదు. లేదంటే వాటి గురించి అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో చేరిన తర్వాత కొన్నాళ్లకు ఆ ప్రాంతం మారాల్సి వచ్చినప్పుడు, వ్యక్తిగత ఇబ్బంది ఎదురైనప్పుడు లేదా పదోన్నతికి అవకాశం లేనప్పుడు రాజీనామా చేయాలంటే ఏదైనా నియమం పాటించాల్సి ఉందేమో అడిగి తెలుసుకోండి. లేదంటే ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడం కష్టమవుతుంది. అలాగే ట్రైనింగ్‌ లేదా ప్రొబెషనరీ పీరియడ్‌ కాలంపై అవగాహన ఉంటే ఆ ప్రకారం నడుచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్