అయితే... నేలపై పడుకోండి!

పనులన్నీ పూర్తయ్యాయి... ఒళ్లంతా అలసిపోయినా నిద్ర మాత్రం దరిచేరదు. పని భారంతో తెలియని కోపం, విసుగు. ఎవరితోనూ గొడవలేదు, బాధపడే సంఘటనలూ జరగలేదు... అయినా మనసు భారంగా తోస్తుంది.

Published : 14 Mar 2024 01:06 IST

పనులన్నీ పూర్తయ్యాయి... ఒళ్లంతా అలసిపోయినా నిద్ర మాత్రం దరిచేరదు. పని భారంతో తెలియని కోపం, విసుగు. ఎవరితోనూ గొడవలేదు, బాధపడే సంఘటనలూ జరగలేదు... అయినా మనసు భారంగా తోస్తుంది... మనకీ లక్షణాలు తరచూ కనిపించేవే కదూ! అలాంటప్పుడు నేలపై పడుకుని చూడమంటున్నారు నిపుణులు. ఎందుకంటే...

  • యోగా చేసేవారికే కాదు, చేయనివారికీ పరిచయమున్న ఆసనం... శవాసనం. నేలమీద వెల్లకిలా పడుకొని, చేతులు, కాళ్లను దూరంగా ఉంచడమే! ఎంత సులువైన ఆసనమో కదా! ఇది కండరాల మధ్య ఉన్న ఒత్తిడిని తగ్గించేస్తుంది. అంతెందుకు నేల ఎంత గట్టిగా ఉంటుంది! పడుకోవడానికి ఒకింత కష్టమే కానీ... ఆ గట్టిదనం తెలియకుండానే భరోసానిస్తుందట. అందుకే మనసూ శాంతపడుతుంది.
  • ప్రకృతి చేసే మాయే వేరు. నేలపై పడుకున్నప్పుడు మనసు ఆ వైబ్రేషన్లను గమనిస్తుంటుందట. తద్వారా దానితో ముడిపడినట్లు భావించి, తెలియకుండానే మనసు తేలికపడుతుంది. అంతేకాదు, ఆందోళనలో ఉన్నప్పుడు ఒకసారి నేలమీద పడుకోండి. అసంకల్పిత ప్రతీకారచర్యను శాసించే నాడులు ఒక్కసారిగా ఉత్తేజితమై, ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తాయి. దాంతో మనసు కుదుట పడుతుంది.
  • ఒక వస్తువును కూర్చొనో, నిల్చొనో, తెలిసో తెలియకో గమనిస్తూనే ఉంటాం. కింద పడుకొని చూస్తున్నప్పుడు అది మనసుకి కొత్త కోణంలో కనిపిస్తుందట. ఆ గమనించే క్రమంలో కూడా ఒత్తిడి దూరమవుతుందట. అందుకే కొత్త ఆలోచనలు రావట్లేదు అనిపించినా, మనసు భారంగా తోచినా, ఒత్తిడి నలిపేస్తున్నా నేల మీద పడుకోమంటున్నారు నిపుణులు. అయితే... శ్వాసనీ, శరీరంలోని ప్రతి అవయవాన్నీ గమనించుకుంటూ కూడా ఉండగలగాలి మరి. అప్పుడే మరింత ప్రయోజనకరం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్