ఏనుగుపై ప్రేమతో...

మూడేళ్ల క్రితం... ఎవరో ప్రేమగా ఇచ్చారనుకుని పండును తిందా ఏనుగు. కొద్దిసేపటికే భరించలేని నొప్పి. తట్టుకోలేక పరుగులు తీసింది. దాన్ని చూసి జనాలంతా భయంతో చెల్లాచెదురయ్యారు.

Updated : 22 Mar 2024 13:05 IST

మూడేళ్ల క్రితం... ఎవరో ప్రేమగా ఇచ్చారనుకుని పండును తిందా ఏనుగు. కొద్దిసేపటికే భరించలేని నొప్పి. తట్టుకోలేక పరుగులు తీసింది. దాన్ని చూసి జనాలంతా భయంతో చెల్లాచెదురయ్యారు. కానీ అది ఎవరికీ హాని కలిగించలేదు కానీ... నొప్పిని తట్టుకోలేక కడుపులో బిడ్డతో సహా చనిపోయింది. కేరళలో జరిగిన ఈ సంఘటనకు కారణం... ఎవరో ఆకతాయులు పండులో టపాకాయలు పెట్టి ఇవ్వడమే! అక్కడ ఉత్సవాలు, పూజల్లో ఏనుగులు తప్పనిసరి. నిజానికి అవి త్వరగా మాట వినవు. అందుకని కొట్టడం, మొనదేలిన ఇనుప చువ్వలతో గుచ్చడం, తిండి పెట్టడకపోవడం వంటి శిక్షలు వేస్తుంటారు. కాళ్లకు, మెడకు వేసే బలమైన బంధనాలతో వాటికి గాయాలూ అవుతుంటాయి.

కుటుంబానికి దూరమై సాధుజీవనం సాగిస్తున్నా... జనాలకు భయపడో, చప్పుళ్లు, ఆకతాయిల చేష్టలకు కోపగించుకునో అప్పుడప్పుడు జనాల మీద విరుచుకుపడతాయి. దాంతో ప్రాణనష్టం కూడా. అయినా సంప్రదాయాన్ని కొనసాగించాలని కొన్ని ఆలయాల కోసం ఏనుగులను పట్టి తెస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితిలో మార్పునకు ప్రయత్నించారు నటి ప్రియమణి. పెటాతో కలిసి కొచ్చిలోని త్రిక్కాయిల్‌ మహదేవ గుడికి మెకానికల్‌ ఏనుగు ‘మహదేవ’ను బహూకరించారు. దాన్ని మేళతాళాలతో గుడిలోనికి స్వాగతించారు కూడా. ‘అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లొచ్చు. దానికి మూగజీవులను హింసించాల్సిన పనిలేదు. వాటికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది’ అంటున్నారు ప్రియమణి. మరి వీళ్లు తీసుకున్న నిర్ణయం అభినందనీయమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్