గిల్టునగలతో అలర్జీలా?

మనలో కొందరికి కొన్ని కొన్ని వాసనలు, ఆహారాలూ సరిపడవు. గిల్టు నగలు వేసుకున్నప్పుడూ అలర్జీలు వస్తుంటాయి. ఎండ చలీ లాంటి వాతావరణ మార్పులు చోటు చేసుకున్నప్పుడు కూడా ఇదే సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఈ ఇబ్బందులకు భ్రమర ముద్ర మంచి ఔషధం. దీన్ని అలర్జీ ముద్ర అని కూడా అంటారు. ఎలా చేయాలంటే

Published : 15 Jan 2022 01:38 IST

మనలో కొందరికి కొన్ని కొన్ని వాసనలు, ఆహారాలూ సరిపడవు. గిల్టు నగలు వేసుకున్నప్పుడూ అలర్జీలు వస్తుంటాయి. ఎండ చలీ లాంటి వాతావరణ మార్పులు చోటు చేసుకున్నప్పుడు కూడా ఇదే సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఈ ఇబ్బందులకు భ్రమర ముద్ర మంచి ఔషధం. దీన్ని అలర్జీ ముద్ర అని కూడా అంటారు. ఎలా చేయాలంటే... ముందుగా మనసును ప్రశాంతంగా ఉంచుకుని, వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి. ఈ ముద్రను రెండు చేతులతో చేయాలి. చూపుడు వేలును బొటన వేలును తాకేలా మడవాలి. బొటన వేలును మధ్యవేలు గోరు పక్కన ఆనించి ఉంచాలి. ఉంగరం వేలు, చిటికెన వేలు తిన్నగా ఉండేట్లు చూసి శ్వాస మీద శ్రద్ధపెట్టాలి. దీర్ఘ శ్వాస తీసుకోకూడదు. శ్వాస లోపలి వరకూ కాకుండా ముక్కు వరకే తీసుకుంటూ వదలాలి. ఇలా ఒక ఐదు నిమిషాలు సుమారుగా వందసార్లు ఊపిరి పీల్చి వదలాలి. ఈ ముద్రతో దుమ్మూధూళి, వాసనలు, ఆహారం, వాతావరణ మార్పుల కారణంగా.. ఇలా ఏ రకమైన అలర్జీలైనా తగ్గిపోతాయి. ముక్కు కారడం, కళ్లు ఎర్రబారడం, తుమ్ములు లాంటి అలర్జీ లక్షణాలు తీవ్రంగా ఉంటే సాయంత్రం కూడా ఐదు నిమిషాలు చేయొచ్చు. లేదంటే ఒకపూట చాలు. అలర్జీలు పూర్తిగా తగ్గాక ఈ ముద్ర అవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్