ఎండకి.. నల్లబడింది!
పాపకి 12ఏళ్లు. ట్యూషన్, కరాటే, ఈత అంటూ ఎండలో బాగా తిరుగుతోంది. దీంతో ముఖమంతా టాన్‌తో నల్లబడింది. పార్లర్‌కి తీసుకెళితే 16 ఏళ్లు నిండాలన్నారు. ఇంట్లోనే తగ్గించే మార్గం చెప్పండి.
పాపకి 12ఏళ్లు. ట్యూషన్, కరాటే, ఈత అంటూ ఎండలో బాగా తిరుగుతోంది. దీంతో ముఖమంతా టాన్‌తో నల్లబడింది. పార్లర్‌కి తీసుకెళితే 16 ఏళ్లు నిండాలన్నారు. ఇంట్లోనే తగ్గించే మార్గం చెప్పండి.
- ఓ సోదరి
పాప ఇంకా చిన్నదే కాబట్టి, రసాయనాలవీ వాడకపోవడమే మంచిది. ట్యాన్ పోవడానికి బయటి నుంచే కాదు లోపల్నుంచీ పోషణ కావాలి. కనీసం 3 లీటర్ల నీరు, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్‌లుండే నట్స్, గుమ్మడి గింజలు, వాల్‌నట్స్, చేప వంటివి రోజువారీ ఆహారంలో ఉండేలా చూడండి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సీజనల్ పండ్లలో విటమిన్ సి ఎక్కువ. దెబ్బతిన్న చర్మ కణాల్ని రిపేర్ చేస్తుంది. తేనెని గోరువెచ్చని నీళ్లతో కలిపి ఇవ్వండి. నేరుగా ముఖానికి వారానికి రెండుసార్లు రాయొచ్చు. పెరుగులో ప్రోబయాటిక్స్, డి విటమిన్ ఉంటాయి. దీన్నీ ఆహారంగా ఇవ్వడంతోపాటు పూతలా వేయొచ్చు. బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. క్యారెట్, టమాట, బొప్పాయి, పాలనీ ఆహారంలో చేర్చండి. ఎండలోకి వెళ్లే అరగంట ముందు కచ్చితంగా మాయిశ్చరైజర్, ఎస్‌పీఎఫ్ 30 ఉన్న సన్‌స్క్రీన్ రాయండి. కారం, జంక్ ఫుడ్‌ను తగ్గించండి. మేకప్ చేయాల్సొస్తే వచ్చాక తప్పక శుభ్రం చేయాలి. బయటి నుంచి వచ్చాక కర్చీఫ్‌లో ఐస్‌ను ఉంచి, తుడవండి.
వారానికోసారి..
* టేబుల్ స్పూను బొప్పాయి గుజ్జు, తేనె
* సగం అరటిపండు గుజ్జు, స్పూను చొప్పున నిమ్మరసం, తేనె
* టమాట, ఓట్‌మీల్ పౌడర్, పెరుగు లేదా పాలు, తేనె
* కీర, పాలు, తేనె, బ్రౌన్ షుగర్.. వీటిల్లో ఏదో ఒకటి ప్యాక్‌లా వేయండి. టాన్‌ని తగ్గించి, మెరిసేలా చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.