ఒంటరి మహిళ దత్తత తీసుకోలేదా?
బాబుకి మూడేళ్లున్నప్పుడు మేం విడాకులు తీసుకున్నాం. ఆ పత్రాల్లో బిడ్డపై సంపూర్ణ హక్కుల్ని అతడు వదులుకుంటున్నట్లుగా రాశాడు. అమ్మ నాకు రెండో పెళ్లి చేసే ముందు నా కొడుకుని దత్తత తీసుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ తంతు రిజిస్టరయ్యింది.
బాబుకి మూడేళ్లున్నప్పుడు మేం విడాకులు తీసుకున్నాం. ఆ పత్రాల్లో బిడ్డపై సంపూర్ణ హక్కుల్ని అతడు వదులుకుంటున్నట్లుగా రాశాడు. అమ్మ నాకు రెండో పెళ్లి చేసే ముందు నా కొడుకుని దత్తత తీసుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ తంతు రిజిస్టరయ్యింది. ఇప్పుడు వాడిపేరున ఆస్తి నమోదు చేయించడానికి ప్రయత్నిస్తే రిజిస్ట్రార్ ఒంటరి మహిళ దత్తత తీసుకోవడం చెల్లదంటున్నారు?
- ఓ సోదరి
మీ లేఖ ప్రకారం, విడాకుల పత్రంలో కొడుకు మీద సంపూర్ణ హక్కులు వదులుకుంటున్నట్లుగా అతడి తండ్రి రాసిచ్చాడని తెలుస్తోంది. హిందూ దత్తత-మనోవర్తి చట్టం ప్రకారం దత్తత తీసుకునేవారి, ఇచ్చేవారి అర్హతను బట్టి అది సరైనదో కాదో నిర్ణయిస్తారు. ఇందులోని సెక్షన్-8 మానసిక స్థితి సరిగా ఉన్న ఒంటరి స్త్రీలెవరైనా సరే (వివాహితులు, వింతంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు) పిల్లల్ని దత్తత స్వీకరించొచ్చని చెబుతోంది. అయితే, వైవాహిక బంధంలో ఉన్నప్పుడు మాత్రం భర్త/భార్య అనుమతి లేకుండా దత్తత తీసుకోవడం కుదరదు. అంతేకాదు, సెక్షన్-11 ప్రకారం పదిహేను సంవత్సరాల లోపు, పెళ్లికాని పిల్లల్ని మాత్రమే దత్తత తీసుకోవాలి. మగపిల్లలు సంతానంగా ఉన్నప్పుడు అబ్బాయిల్నీ, ఆడపిల్లలు ఉన్నవారు అమ్మాయిల్నీ అడాప్ట్ చేసుకోలేరు. ఒకవేళ ఒంటరి పురుషులు బాలికలను, స్త్రీలు బాలురను దత్తత తీసుకోదలుచుకుంటే వారి ఇద్దరి మధ్య వయసు తేడా ఇరవై ఒక్కేళ్లు ఉండాలి. ఇక, ఇందులోని సెక్షన్-16ని అనుసరించి అడాప్షన్ డీడ్ రిజిస్టర్ అయితే, దత్తత సరైన పద్ధతిలో జరిగినట్లుగానే పరిగణిస్తారు. ఇక, వీటితో పాటు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(సీఏఆర్‌ఏ) ఒక స్టాట్యుటరీ బాడీగా జువైనల్ యాక్ట్ కింద కొన్ని అంశాలతో నియమావళిని తీసుకొచ్చింది. దీని ప్రకారం పద్దెనిమిదేళ్లు నిండని వారిని చిన్నారులుగా లెక్కేస్తారు. ఇక మీ అబ్బాయి దత్తత హిందూ దత్తత విధానంలోనే జరిగాయి కాబట్టి చట్టబద్ధమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.