చదువంటే ఇష్టం లేదు..

మా అమ్మాయికి తొమ్మిదేళ్లు. చదువుకోమంటే చాలు మొహం వేలాడేస్తుంది. నచ్చచెప్పి చదివించబోతే.. కడుపునొప్పి అంటుంది. ఆ నొప్పి నిజం కాదని అర్థమైపోతుంది. పుస్తకాలు పక్కన పెట్టేస్తే.. మామూలుగానే ఉంటుంది.

Published : 16 Oct 2023 02:22 IST

మా అమ్మాయికి తొమ్మిదేళ్లు. చదువుకోమంటే చాలు మొహం వేలాడేస్తుంది. నచ్చచెప్పి చదివించబోతే.. కడుపునొప్పి అంటుంది. ఆ నొప్పి నిజం కాదని అర్థమైపోతుంది. పుస్తకాలు పక్కన పెట్టేస్తే.. మామూలుగానే ఉంటుంది. తనలో మార్పు రావాలంటే ఏం చేయాలి?

- ఒక సోదరి

సాధారణంగా చిన్న పిల్లలకు ఆటల పట్ల ఉండే ఆసక్తి చదువు మీద ఉండదు. మీ పాప చదువుకోమనగానే.. కడుపునొప్పి అంటూ, పుస్తకాలు వదిలేయగానే.. మామూలుగా ఉంటోందన్నారు. అంటే.. చదువు ఆమెని ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే దాన్నుంచి తప్పించుకోవడానికి అలా సాకు చెప్తోంది. వయసుకు తగిన తెలివి లేకున్నా, టీచర్‌ చెప్పింది అర్థం చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉన్నా.. పాఠాలు అర్థంకావు. చదువంటే ఆమె భయపడుతున్నట్లు అర్థమవుతోంది. బహుశా బార్డర్‌లైన్‌ ఇంటెలిజెన్స్‌ ఉండి ఉంటుంది. అక్షరాలు గుర్తుపట్టడం, చదవడం, రాయడం లాంటి అంశాల్లో లోపం ఉందేమో! దీన్ని స్పెసిఫిక్‌ లెర్నింగ్‌ డిజెబిలిటి (డిస్‌లెక్సియా, డిస్‌ గ్రాఫియా) అంటారు. లేదా ఏకాగ్రత లోపమో.. అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివిటీ డిజార్డర్‌(ఎడీహెచ్‌డీ) అయ్యుండొచ్చు. ఈ సమస్య ఉంటే.. కదలకుండా ఒకచోట కూర్చోలేరు. చదువు మీద మనసు కేంద్రీకరించలేరు. మీరు అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా చైల్డ్‌ సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి. పాపను అన్ని కోణాల్లోంచి పరీక్షిస్తారు. పాపకి టీచర్లు, తోటి పిల్లలంటే భయాలున్నాయేమో తెలుసుకుంటారు. అసలు సమస్య ఏమిటో నిర్ధారిస్తారు. చదువు మీద శ్రద్ధపెట్టడంలో, మనసు కేంద్రీకరించడంలో ఇబ్బంది ఉంటే తెలుస్తుంది. చదువు పట్ల భయం తగ్గి ఆసక్తి కలిగే పద్ధతులు నేర్పిస్తారు. పెద్దలుగా మీరేం చేయాలో మీకూ చెబుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్