ఇంటి పేరు మారితే బీమా రాదా!

నా వయసు 45. పీజీ చదివి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. నాకు పెళ్లై 29 ఏళ్లు. ఇప్పటికీ నా ఆధార్‌, పాన్‌, బ్యాంకు అకౌంట్లు అన్నీ పుట్టింటి  పేరుతోనే ఉన్నాయి.

Updated : 12 Dec 2023 05:05 IST

నా వయసు 45. పీజీ చదివి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. నాకు పెళ్లై 29 ఏళ్లు. ఇప్పటికీ నా ఆధార్‌, పాన్‌, బ్యాంకు అకౌంట్లు అన్నీ పుట్టింటి  పేరుతోనే ఉన్నాయి. అయితే, బీమాలో నామినీగా మావారి పేరు పెట్టా. భవిష్యత్తులో అనుకోనిది ఏదైనా జరిగితే రావాల్సిన క్లెయిమ్‌, ఇతరత్రాల విషయంలో  మాకు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా? సలహా ఇవ్వగలరు?

ఓ సోదరి.

పుట్టింటి పేరు ఉన్నంత మాత్రాన ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌కి ఎవరూ అడ్డుపడరు. మీ సర్టిఫికెట్లన్నీ కూడా ఆ పేరుతోనే ఉన్నాయి అంటున్నారు. మిగిలిన మీ ధ్రువపత్రాల్లో వైఫ్‌/ఆఫ్‌.... అని మీ భర్త ఇంటి పేరుతో సహా ఉంటుంది కదా! ఇబ్బంది ఉండదు. ఏదైనా అవాంతరం ఎదురైతే, మీ పెళ్లి సర్టిఫికెట్‌, ఫొటోలను ప్రూఫ్‌గా చూపించొచ్చు. ఇంటిపేరుతోపాటు పేరు కూడా మారిందా? ఎందుకంటే, ఇంటిపేరు ఒక్కటే మారితే ఇబ్బంది లేదు. పేరు మారితే గుర్తింపు సమస్యలు రావొచ్చు. అత్తింటివారు పేరు మార్చడం, జాతకాలు కుదరకపోవడం, ఇతరత్రా అనేక కారణాలతో వేరే పేర్లు పెట్టుకున్నప్పుడు అన్ని సర్టిఫికెట్లలోనూ ‘అలియాస్‌’ అని రాస్తుంటారు. ఇలాంటప్పుడు మీరు ఎందుకు మార్చుకున్నారో, ఎప్పుడు మార్చారో చెబుతూ అఫిడవిట్‌ని రూపొందించండి. తగిన ఫీజు కట్టి సెక్రటేరియట్‌లోని ‘నేమ్‌ ఛేంజింగ్‌ డిపార్ట్‌మెంట్‌’లో ఇవ్వండి. వారు ఆ దరఖాస్తుని పరిశీలించి అన్నీ సరిగా ఉంటే గెజిట్‌ పబ్లికేషన్‌ ద్వారా పేరు మార్పు గురించి తెలియజేస్తారు. అది మీకు అధికారిక పత్రం అవుతుంది. సాధారణంగా సమస్య ఇన్సూరెన్స్‌ వాళ్లతో రాదు. ఒకవేళ వస్తుందేమో అని భయపడే బదులు నేను చెప్పిన నియమావళిని అనుసరించి అధికారికంగా మార్చుకోండి. గెజిట్‌ పబ్లికేషన్‌ కాపీతో అన్ని సర్టిఫికెట్లలో మార్చుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్