పెళ్లి చేస్తే ఆ సమస్య తగ్గుతుందా!

మా అక్క కూతురి వయసు 19ఏళ్లు. ఇంటర్‌ పూర్తయింది. చదువుల్లో చురుగ్గానే ఉంటుంది. కానీ ఐదేళ్లుగా ఫిట్స్‌ సమస్యతో బాధపడుతోంది. బరువూ పెరిగింది. దేనిమీదా శ్రద్ధ పెట్టలేకపోతోంది. మందులు వాడుతున్నప్పటికీ సమస్య పూర్తిగా తగ్గటం లేదు. ఒత్తిడిగా ఫీలవుతోందని చదువూ మాన్పించారు. పైగా పెళ్లి చేస్తే ఈ సమస్య అదుపులోకి వస్తుందని ఎవరో చెప్పారట. సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.

Updated : 02 Feb 2024 10:31 IST

మా అక్క కూతురి వయసు 19ఏళ్లు. ఇంటర్‌ పూర్తయింది. చదువుల్లో చురుగ్గానే ఉంటుంది. కానీ ఐదేళ్లుగా ఫిట్స్‌ సమస్యతో బాధపడుతోంది. బరువూ పెరిగింది. దేనిమీదా శ్రద్ధ పెట్టలేకపోతోంది. మందులు వాడుతున్నప్పటికీ సమస్య పూర్తిగా తగ్గటం లేదు. ఒత్తిడిగా ఫీలవుతోందని చదువూ మాన్పించారు. పైగా పెళ్లి చేస్తే ఈ సమస్య అదుపులోకి వస్తుందని ఎవరో చెప్పారట. సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నిజంగా అలా జరుగుతుందా? తెలియజేయగలరు.

-ఓ సోదరి

చిన్నప్పుడు జ్వరంతోనో, కాన్పు సమయంలో బ్రెయిన్‌ డ్యామేజ్‌ అవడం వల్లనో ఫిట్స్‌ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మొదటి సారి 14 నుంచి 18 ఏళ్లలోపు వచ్చిందంటే అది నరాల సమస్య వల్ల వచ్చేవి అయి ఉండొచ్చు. ఒత్తిడి వల్లా ఇలా జరగొచ్చు. మందులు వాడుతున్నామన్నారు. అది న్యూరోలాజికల్‌ ఫిట్సా లేదా సైకలాజికల్‌ ఫిట్సా అనేది తెలియటంలేదు. ముందు ఆమెను న్యూరాలజిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లండి. వాళ్లు ఎలక్ట్రో ఎన్‌సెఫలో గ్రామ్‌ (ఈఈజీ), ఎమ్‌ఆర్‌ఐ బ్రెయిన్‌ వంటి పరీక్షలు చేస్తారు. అన్నీ మామూలుగా ఉన్నాయంటే... చదువుల ఒత్తిడి వల్లా ఇలా అయ్యిండొచ్చు. దీన్ని హిస్టీరికల్‌ ఫిట్స్‌ అంటారు. దీనికి ఆందోళన తగ్గించే మందులు కానీ, రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ టెక్నిక్స్‌ వంటివి నేర్పిస్తారు. అవసరమైతే సైకాలజిస్ట్‌కూ రిఫర్‌ చేస్తారు. మరో విషయం ఏంటంటే.. పెళ్లి చేయటం వల్ల ఫిట్స్‌ తగ్గుతుందన్నది తప్పు. తన సమస్యల్నే పరిష్కరించుకోలేని స్థితిలో ఉన్న అమ్మాయికి పెళ్లి చేస్తే... మరిన్ని బాధ్యతలు మీద పడతాయి. దీనివల్ల మానసికంగా, శారీరకంగా మరింత ఒత్తిడికి గురవుతారు. ఈ పరిస్థితుల్లో తనకు పెళ్లి చేయటం మంచిది కాదు. ముందు సమస్య ఏంటో తెలుసుకుని, సరైన చికిత్స ఇప్పించండి. తనకు నయమై, చదువు మీద ఆసక్తి చూపిస్తే చదివించండి. లేకుంటే అప్పుడు పెళ్లి గురించి ఆలోచించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్