ఈ వయసులో జుట్టు నల్లబడుతుందా?
నా వయసు 32 సంవత్సరాలు. నాకు తెల్లజుట్టు సమస్య ఉంది. తలముందు భాగంలో కొత్త వెంట్రుకలు పెరుగుతున్నాయి. కానీ, అవి కూడా తెల్లగా మారుతున్నాయి. ఇది జన్యుపరమైన సమస్యా?
నా వయసు 32 సంవత్సరాలు. నాకు తెల్లజుట్టు సమస్య ఉంది. తలముందు భాగంలో కొత్త వెంట్రుకలు పెరుగుతున్నాయి. కానీ, అవి కూడా తెల్లగా మారుతున్నాయి. ఇది జన్యుపరమైన సమస్యా? ఈ వయసులో వెంట్రుకలు నల్లబడడం సాధ్యమేనా? ఇప్పుడు నేనేం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. 35 ఏళ్లు పైబడిన వారిలో జుట్టు తెల్లబడడం అనేది చాలా సాధారణ అంశం. అయితే చాలామందిలో వంశపారపర్యంగా తెల్లజుట్టు వస్తుంటుంది. అంటే కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే తెల్లజుట్టు వచ్చి ఉంటే తర్వాత తరాల వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. తీసుకునే ఆహారంలో ముఖ్యమైన విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ లోపం ఉన్నా జుట్టు తెల్లబడుతుంది. ఇవే కాకుండా గాఢత ఎక్కువగా ఉన్న షాంపూలు ఉపయోగించడం.. జెల్స్, స్టైలింగ్ వల్ల కూడా తొందరగా తెల్లజుట్టు వచ్చే అవకాశం ఉంటుంది.
ఒకవేళ వంశపారంపర్యంగా తెల్లజుట్టు వస్తోందంటే దానికి ఎలాంటి చికిత్స ఉండదు. అదికాకుండా ఏదైనా పోషకాల లోపం వల్ల జుట్టు తెల్లబడుతోందంటే దానికి సంబంధించిన చికిత్స తీసుకోవడం వల్ల జుట్టు తిరిగి నల్లబడే అవకాశం ఉంటుంది. వీటికి తోడు ఒత్తిడి, ఆందోళన సమస్యలను తగ్గించుకోవాలి. తీసుకునే ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే శరీరానికి సరిపడినంత నిద్ర అవసరం. తగినన్ని నీళ్లు తాగడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు తెల్లబడడాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.