Break The Bias: వివక్షను అధిగమిస్తాం.. ముందుకు దూసుకుపోతాం..!

ఇంటా, బయటా.. వివక్షే! ఇదే మన ప్రతిభను, పనితనాన్ని ప్రపంచానికి చాటకుండా అడ్డుపడుతోంది.. ఇదే మన ఎదుగుదలను మొగ్గలోనే తుంచేస్తోంది. మరి, ఈ విషయాన్ని గ్రహిస్తే సరిపోదు.. దీన్ని అంతమొందించే ఆయుధాలు కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇదే ప్రధానమైన అజెండా. ‘Break The Bias’ అంటూ మన ఉన్నతికి అడ్డుగా ఉన్న...

Updated : 09 Mar 2022 16:55 IST

అదీ ఇదీ అని లేకుండా- అవని నుంచి అంతరిక్షం దాకా.. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు.. తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.. మగవాళ్లకు దీటుగా.. అన్నిట్లోనూ దిట్టగా.. మనకు సాటి లేదంటూ మున్ముందుకు సాగిపోతున్నారు..! పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులుగా.. దేశాధినేతలుగా.. తిరుగులేని నాయకులుగా రాణిస్తున్నారు!

అయినా ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇదే మన ప్రతిభను, పనితనాన్ని ప్రపంచానికి చాటకుండా అడ్డుపడుతోంది.. ఇదే మన ఎదుగుదలను మొగ్గలోనే తుంచేస్తోంది. మరి, ఈ విషయాన్ని గ్రహిస్తే సరిపోదు.. దీన్ని అంతమొందించే ఆయుధాలు కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇదే ప్రధానమైన అజెండా. ‘Break The Bias’ అంటూ మన ఉన్నతికి అడ్డుగా ఉన్న వివక్షను బద్దలుకొట్టమంటోంది. మనమేమిటో మరింతగా నిరూపించమంటోంది.

మరి ఇందుకు మీరు సిద్ధమేనా? అయితే దాన్ని ప్రతిబింబించేలా పై చిత్రంలో చూపించినట్లు ఓ ఫొటో క్లిక్‌మనిపించండి. #BreakTheBias క్యాంపెయిన్ లో భాగస్వాములు కండి. సింగిల్‌గా లేదంటే కుటుంబ సభ్యులతో, సహోద్యోగులతో, స్నేహితులతో బృందంగా దిగిన ఫొటోల్ని కూడా పంపించవచ్చు. ఇందులో పురుషులు, పిల్లలు సైతం భాగం కావచ్చు. వివక్షను బద్దలుకొట్టడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే మరి!

వివక్షను ఇలా బద్దలుకొడతాం..!

పంపినవారు : భవ్య, విశాఖపట్నం


మేఘన, బెంగళూరు


రచన, బెంగళూరు


ఉదయలక్ష్మి, బెంగళూరు


మల్లిక, హైదరాబాద్‌


స్రవంతి, హైదరాబాద్‌


సమ్యక్‌ కుమార్‌, హైదరాబాద్‌


అమోఘ, హైదరాబాద్‌


 

సీత, హైదరాబాద్‌


శ్రావణి, హైదరాబాద్‌


విజయ, ఖమ్మం


కావ్యాంజలి, తిరుపతి


సౌమిక, విశాఖపట్నం


అరుణ, హైదరాబాద్‌


పద్మజ, సింగపూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్