గోల్ఫ్‌ స్టిక్కులు కావివి.. ఫ్రూట్‌ ఫోర్కులు!

పండ్ల ముక్కల్ని తినడానికి ఫోర్కులు లేదంటే టూత్‌పిక్స్‌ ఉపయోగిస్తుంటాం. అయితే చాలామంది ఇళ్లలో స్టీలు, ప్లాస్టిక్‌ మెటీరియల్‌తో రూపొందించిన స్పూన్‌ తరహా ఫోర్కులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి, ఎప్పుడూ వీటితోనే అంటే బోర్‌ కొడుతోందా? అందులోనూ పిల్లలు పండ్లు తినమని మొండికేస్తున్నారా? అలాంటప్పుడు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటుల.....

Published : 30 Mar 2022 15:57 IST

పండ్ల ముక్కల్ని తినడానికి ఫోర్కులు లేదంటే టూత్‌పిక్స్‌ ఉపయోగిస్తుంటాం. అయితే చాలామంది ఇళ్లలో స్టీలు, ప్లాస్టిక్‌ మెటీరియల్‌తో రూపొందించిన స్పూన్‌ తరహా ఫోర్కులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి, ఎప్పుడూ వీటితోనే అంటే బోర్‌ కొడుతోందా? అందులోనూ పిల్లలు పండ్లు తినమని మొండికేస్తున్నారా? అలాంటప్పుడు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న విభిన్న ఫ్రూట్‌ ఫోర్కులపై ఓ లుక్కేయాల్సిందే!

గోల్ఫ్‌ స్టిక్స్‌, పక్షులు, వివిధ రకాల పండ్లు, డ్యాన్సింగ్‌ డాల్స్‌.. వంటి విభిన్న ఆకృతుల్లో రూపొందించిన ఫ్రూట్‌ ఫోర్కులు బోలెడన్ని డిజైన్లలో మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇక పిల్లల కోసం.. వివిధ కార్టూన్‌ క్యారక్టర్స్‌, జిరాఫీ ఆకృతిలో ఉన్నవి, పిల్లల బొమ్మలతో రూపొందించినవి, చిట్టి చిట్టి చీమల మోడల్‌లో తయారుచేసినవి.. వంటి విభిన్న తరహాలో రూపొందించిన ఫోర్కులు లభ్యమవుతున్నాయి. అలాగే వీటిని అమర్చుకోవడానికి ఆకర్షణీయమైన స్టాండ్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ఫోర్కులతో పిల్లల్లో పండ్లు తినాలన్న ఆసక్తిని పెంచచ్చు. అలాగే ఇంటికి అతిథులొచ్చినప్పుడు ఇలాంటి విభిన్న ఫ్రూట్‌ ఫోర్కులతో ఫ్రూట్‌ సలాడ్‌ని అందించి చూడండి.. కచ్చితంగా ఫిదా అయిపోతారు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్