Popsicle Molds : ఇవి పిల్లలకు పసందు!

ఐస్‌క్రీమ్‌ను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి? ఇక పిల్లలకైతే మరీనూ! పైగా ఈ వేసవిలో మనతో పాటు బయటికి తీసుకెళ్తే చాలు.. వారికి నచ్చిన ఫ్లేవర్‌ ఐస్‌క్రీమ్‌ కొనిచ్చే దాకా ఓ పట్టాన వదిలిపెట్టరు. ఇక పిల్లల ఈ కోరికను తీర్చడానికి చాలామంది తల్లులు ఇప్పుడు ఇంట్లోనే రుచికరమైన.....

Published : 19 May 2022 16:45 IST

ఐస్‌క్రీమ్‌ను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి? ఇక పిల్లలకైతే మరీనూ! పైగా ఈ వేసవిలో మనతో పాటు బయటికి తీసుకెళ్తే చాలు.. వారికి నచ్చిన ఫ్లేవర్‌ ఐస్‌క్రీమ్‌ కొనిచ్చే దాకా ఓ పట్టాన వదిలిపెట్టరు. ఇక పిల్లల ఈ కోరికను తీర్చడానికి చాలామంది తల్లులు ఇప్పుడు ఇంట్లోనే రుచికరమైన ఐస్‌క్రీమ్స్‌ తయారుచేస్తున్నారు. ఇందుకోసం విభిన్న రకాల ఐస్‌క్రీమ్‌ మోల్డ్స్‌/పాప్సికల్‌ మోల్డ్స్‌ను ఎంచుకుంటున్నారు. అయితే వీటిలోనూ సాదాసీదాగా ఉండేవే మనకు ఎక్కువగా తారసపడుతుంటాయి. కానీ పిల్లల కోసం కూడా వేర్వేరు ఆకృతుల్లో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌ మోల్డ్స్‌ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి.

వివిధ రకాల బొమ్మలు, కార్టూన్‌ క్యారక్టర్లు, పండ్లు, లాలీపాప్‌ షేప్‌లో ఉన్నవి, జంతువుల ఆకృతుల్లో ఉన్నవి, పువ్వులు-పక్షుల డిజైన్లతో కూడినవి, కోన్‌ తరహావి, గొడుగు మాదిరిగా ఉండి కుల్ఫీ వంటి పొడవాటి మోల్డ్స్‌, కార్లు-ఇతర చిన్న చిన్న మినీ వాహనాలను పోలి ఉన్నవి.. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లలు ఇష్టపడే పాప్సికల్‌ మోల్డ్స్‌ బోలెడు! పైగా ఇవన్నీ సిలికాన్‌ మెటీరియల్‌తో తయారుచేయడం వల్ల ఫ్లెక్సిబుల్‌గా ఉండడంతో పాటు పిల్లల ఆరోగ్యానికి కూడా ఎలాంటి హానీ జరగదు.. వీటి ధర కూడా రీజనబుల్‌గానే ఉంటుంది. మరి, పిల్లలెంతో ఇష్టపడే ఐస్‌క్రీమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే ఈ వెరైటీ పాప్సికల్‌ మోల్డ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్