తెరమీద ఆడేదెవరంటే...
సచిన్, ధోనీ, మేరీకోమ్ వంటి క్రీడాకారుల బయోపిక్‌లు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. అదే విధంగా ఈ ఏడాది మరికొందరు క్రీడాకారుల జీవితాలు తెరపైన సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇంతకీ మనం చూడబోయే ఆ క్రీడాకారులు ఎవరూ... ఆ ప్రాతల్లో కనిపించే తారలెవరూ అంటే...
కపిల్ జీవితం ‘83’గా
భారత క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ ఓ అంకం. టీమిండియాకు తొలి ప్రపంచ కప్ అందించి విశ్వవిజేతగా నిలిపిన సారథిగా చరిత్రకెక్కాడు. అందుకే నేటి తరానికీ కపిల్‌దేవ్ విజయాల్ని కళ్లకు కట్టాలని బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ సిద్ధమయ్యాడు. 1983లో భారత జట్టును విజేతగా నిలిపిన నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తీస్తుండటంతో ‘83’ అనే పేరుపెట్టాడు. ఇందులో కపిల్‌గా రణ్వీర్ కనిపిస్తుండగా... ఆయన భార్య రోమీ దేవిగా దీపికా పదుకొణె నటిస్తోంది. పెళ్లైన తరవాత రణ్వీర్, దీపికలు కలిసి నటిస్తున్న తొలిచిత్రమిదే. మరి కపిల్ స్టైల్లో రణ్వీర్ కొట్టిన నటరాజ్ షాట్లను చూడాలంటే ఏప్రిల్ వరకూ ఆగాల్సిందే.
చిత్రీకరణలో ‘సైనా’
మనదేశంలో బ్యాడ్మింటన్ అంటే గుర్తొచ్చే క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ పేరు కూడా ఉంటుంది. అందుకే ఆమె జీవితాన్ని తెరపైన చూపాలనుకున్నాడు దర్శకుడు అమోల్ గుప్తా. మూడేళ్ల క్రితం ‘సైనా’ పేరుతో మొదలైన ఈ చిత్రంలో మొదట శ్రద్ధాకపూర్ సైనా పాత్రకు ఎంపికైంది. ఆమె బ్యాడ్మింటన్ నేర్చుకుని షూటింగ్ మొదలుపెట్టిన కొన్నిరోజులకే సినిమా నుంచి తప్పుకోవడంతో పరిణీతి చోప్రా ప్రాజెక్టులోకి వచ్చింది. ఇందుకోసం నాలుగునెలలపాటు బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందిన పరిణీతి తీవ్ర గాయాలపాలైంది. దాంతో కొంత కాలం విరామం తీసుకున్నాక గతేడాది ఆ సినిమా చిత్రీకరణ మళ్లీ మొదలైంది. ఇందులో పుల్లెల గోపీచంద్‌గా మానవ్ కౌల్ నటిస్తున్నాడు.
‘సింధు’... నిర్మాత సోనూసూద్
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు జీవితం కూడా తెరకెక్కనుంది. దీపిక పదుకొణె ప్రధాన పాత్రలో పీవీసింధు జీవితాన్ని చూపిస్తామని ఇదివరకే నటుడు సోనూసూద్ ప్రకటించాడు. ఇందులో సింధు కోచ్ పుల్లెల గోపీచంద్‌గా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కనిపిస్తాడని సమాచారం. దీపిక విషయానికొస్తే ఆమె తాతా, తండ్రీ కూడా బ్యాడ్మింటన్ నేపథ్యం ఉన్నవారే. అందుకే స్కూల్లో ఉన్నప్పుడు ఇష్టం కొద్దీ బ్యాడ్మింటన్ నేర్చుకోవడంతోపాటు పలు జాతీయ స్థాయి ఛాంపియన్షిప్పుల్లోనూ పాల్గొంది. అందుకే సింధు కూడా తన పాత్రలో దీపిక కనిపించాలని కోరుకుంది.
శభాష్ మిథు
మహిళాక్రికెట్ క్వీన్ మిథాలీ రాజ్. ఆమె సారథ్యంలోనే భారత జట్టు ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది. దాంతోపాటు బలమైన జట్లనూ ఓడించిన ఘనతా మిథాలీకే దక్కుతుంది. అలానే వ్యక్తిగతంగానూ ఎన్నో రికార్డులను సొంతం చేసుకుని అందనంత ఎత్తుకెళ్లిన మిథాలీ జీవితాన్ని సినీ రంగం ఎందుకు వదిలేస్తుంది? అందుకే ‘శభాష్ మిథు’ పేరుతో తెరకెక్కిస్తోంది. ఇందులో మిథాలీగా తాప్సీ కనిపిస్తుంది. ఈ మధ్యనే తాప్సీ బ్యాట్ పట్టుకున్న పోస్టర్‌ను విడుదల చేసిందిఆ చిత్ర బృందం.
షూటర్ బింద్రా జీవితం
ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించిన షూటర్ అభినవ్ బింద్రా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనిల్‌కపూర్ తనయుడూ సోనమ్‌కపూర్ సోదరుడూ అయిన హర్షవర్ధన్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అనిల్‌కపూర్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలానే అభినవ్ బింద్రా జీవితంలో కీలక పాత్ర పోషించిన అతని తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించనున్నాడు. వాస్తవానికి మూడేళ్ల క్రితమే హర్షవర్ధన్ ఈ చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ షూటింగ్లో మెలకువలు తెలుసుకునే క్రమంలో ఆలస్యంగా చిత్రీకరణ మొదలైంది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: రెజీనా ‘లైఫ్’ క్యాప్షన్.. కట్టిపడేసేలా జాక్వెలిన్ ‘రెడ్’లుక్!
-
Business News
Credit card rules: జులై 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్..
-
General News
PSLV C53: పీఎస్ఎల్వీ సీ53 మిషన్ ప్రయోగం విజయవంతం
-
World News
Israel: ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దు.. నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికలు
-
General News
APSRTC: ఏపీలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు?
-
India News
Nirmala Sitharaman: ‘హార్స్ ట్రేడింగ్’పై జీఎస్టీ.. నిర్మలమ్మ పొరబాటు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిందే.. నేడే ప్రమాణం
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?