మునగాకు నీటితో అందం

మనందరికీ సుపరిచితమైన కాయగూరల్లో మునగ ఒకటి. దీనిలోని పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. మునగాకు నీటిని ఉదయం లేదా సాయంత్రం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.

Published : 23 Mar 2024 01:36 IST

మనందరికీ సుపరిచితమైన కాయగూరల్లో మునగ ఒకటి. దీనిలోని పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. మునగాకు నీటిని ఉదయం లేదా సాయంత్రం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.

  • మునగాకు గింజల్లో విటమిన్‌- ఎ, సి, ఇ లు మెండుగా ఉంటాయి. చర్మానికి కావల్సిన తేమను అందించి మృదువుగా ఉంచుతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీరాడికల్స్‌తో పోరాడేలా చేసి వృద్ధాప్యఛాయలను తగ్గిస్తాయి. గ్లాసు నీటిలో చెంచా మునగాకు పొడి, అరచెంచా ఉసిరిపొడి కలిపి ఉదయం లేదా రాత్రి తాగితే నెలసరి సమస్యలు దూరం అవుతాయి.
  • జుట్టును తేమగా ఉంచే అమైనో ఆమ్లాలు, ఒలియాక్‌ ఆమ్లాలు మునగాకులో ఉన్నాయి. ఇవి నిస్తేజమైన కురులను పునర్జీవింప చేయడంలో సాయపడతాయి. తేమను కోల్పోకుండా చేస్తాయి. మూడు చెంచాల మునగాకు పొడిలో సరిపడా రైస్‌వాటర్‌, చెంచా కలబంద గుజ్జు కలిపి మాడు నుంచి చివర్ల వరకు పట్టించాలి. అరగంటాగి గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి. వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
  • మునగాకు మొటిమల్నీ, మచ్చల్నీ, ముడతల్నీ తగ్గిస్తుంది. ఇందులో నారింజతో పోలిస్తే విటమిన్‌- సి ఏడురెట్లు ఎక్కువ. అమ్మాయిల్లో అత్యంత సాధారణంగా ఎదురయ్యే మంగు మచ్చల్నీ నియంత్రిస్తుంది. చెంచా మునగాకు పొడికి రెండు చెంచాల పెరుగులో కలిపి ముఖానికి పట్టించాలి. ఆరాక చల్లటినీటితో శుభ్రం చేస్తే సరి. వారానికి రెండుసార్లు చేస్తే సమస్య తగ్గుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్