కురులకు కెరొటిన్‌ చికిత్స

వెంట్రుకలు రాలుతున్నాయా? దీనికితోడు నిర్జీవంగా కనిపిస్తున్నాయా! అయితే కెరొటిన్‌ చికిత్సను తీసుకుంటే సరి. కంగారు పడకండి. దీన్ని ఇంట్లోనే ప్రయత్నించొచ్చు ఇలా..

Published : 10 Feb 2022 00:12 IST

వెంట్రుకలు రాలుతున్నాయా? దీనికితోడు నిర్జీవంగా కనిపిస్తున్నాయా! అయితే కెరొటిన్‌ చికిత్సను తీసుకుంటే సరి. కంగారు పడకండి. దీన్ని ఇంట్లోనే ప్రయత్నించొచ్చు ఇలా..

* కప్పు ఉడికించి చల్లార్చిన అన్నాన్ని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. దానికి రెండు చెంచాల పెరుగు, చెంచా ఆముదం వేసి బాగా కలపాలి. తల స్నానం చేసి, ఆరిన జుట్టుకు ఈ మిశ్రమాన్ని మాడుతో సహా పట్టించాలి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరి. దీనిలోని అమినో యాసిడ్స్‌, బీ, ఈ విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చుండ్రును దూరం చేయడంతోపాటు శిరోజాలనూ మృదువుగా మారుస్తాయి. ఆముదం సహజ ఔషధంలా పనిచేసి మాడుకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. దీంతో కేశాలూ రాలవు.

* రెండు కోడిగుడ్ల సొనకు చెంచా వెజిటబుల్‌ ఆయిల్‌, వెనిగర్‌ చేర్చి బాగా గిలకొట్టాలి. ఆపై చెంచా మయోనీజ్‌, అవకాడో పండు గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంటసేపు ఆరనిచ్చి శుభ్రం చేయాలి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫ్యాటీయాసిడ్స్‌, ఖనిజ లవణాలు, బయోటిన్‌తోపాటు ఏ, బీ-5, ఈ విటమిన్లు ఉంటాయి. ఇవి కురులను మృదువుగా మెరిసేలా చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. వారానికోసారి ప్రయత్నిస్తే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్