తల్లులకు కావాలి చిక్కుడు

అన్ని సీజన్లలోనూ దొరికే చిక్కుడు కాయల్ని చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇవి మహిళల ఆరోగ్యానికి గట్టి మేలే చేస్తాయి.

Updated : 05 Jun 2022 05:20 IST

అన్ని సీజన్లలోనూ దొరికే చిక్కుడు కాయల్ని చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇవి మహిళల ఆరోగ్యానికి గట్టి మేలే చేస్తాయి.

* మనలో చాలా మందిలో ఉండే సమస్య రక్తహీనత. చిక్కుడు ఈ సమస్యను దూరం చేస్తుంది. చిక్కుడులో ఐరన్‌ అధిక మోతాదులో లభిస్తుంది. హిమోగ్లోబిన్‌లో ఉండే ఐరన్‌.. ఆక్సిజన్‌ రవాణాలో, నిల్వలో కీలక పాత్ర పోషిస్తుంది.

* కాబోయే తల్లులు తమ ఆహారంలో చిక్కుళ్లకు తప్పక చోటివ్వాలి. వీటిలో అధిక మోతాదులో దొరికే ఫొలేట్‌.. కణాల ఉత్పత్తి, అవయవ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. తొలి త్రైమాసికంలో ఫొలేట్‌ సరైన మోతాదులో అందకపోతే న్యూరల్‌ ట్యూబ్‌ లోపాలు వస్తాయి. దీనివల్ల శిశివుల్లో మెదడు, వెన్నుపాము ఎదుగుదల సరిగ్గా ఉండదు.

* దీన్లో ఎక్కువ మోతాదులో ఉండే మెగ్నీషియం, మాంగనీస్‌, కాపర్‌.. దంతాలూ, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇవి వయోధిక మహిళల్లో ఎముకల సమస్యల్ని దూరం చేస్తాయి.

* చిక్కుడులో విటమిన్‌ ఇ, కె ఉంటాయి. గాయాలైనపుడు రక్తం గడ్డ కట్టడంలో విటమిన్‌-కె, ఆక్సిజన్‌ని తీసుకువెళ్లే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో విటమిన్‌-ఇ సాయపడతాయి. వీటిలో జింక్‌ కూడా లభిస్తుంది. గాయాల్ని మాన్పడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో జింక్‌ పాత్ర ఎక్కువ.

* పొటాషియం, మెగ్నీషియం.. రక్త నాళాలపైన ఒత్తిడి పడకుండా చేసి గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. చిక్కుడులో ఈ రెండూ అధికంగా ఉంటాయి.

* చిక్కుడులో పీచు పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

పోషకాల గని అయిన చిక్కుడులో క్యాలరీలు మాత్రం చాలా తక్కువ. కాబట్టి బరువు నియంత్రణకీ సాయపడతాయి. అందుకే చిక్కుళ్లను తరచూ మీ ఆహారంలో భాగం చేసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్