వ్యాయామానికి.. తగు!

వ్యాయామం చేద్దామనుకున్నప్పుడు జిమ్‌కి వెళ్లినా, ఇంట్లో చేసినా దుస్తుల ఎంపిక తగినట్లుగా ఉండాలి. అసౌకర్యంగా ఉండే వాటితో వ్యాయామం ప్రశాంతంగా సాగకపోగా విరక్తీ కలుగుతుంది.

Published : 13 Apr 2023 00:07 IST

వ్యాయామం చేద్దామనుకున్నప్పుడు జిమ్‌కి వెళ్లినా, ఇంట్లో చేసినా దుస్తుల ఎంపిక తగినట్లుగా ఉండాలి. అసౌకర్యంగా ఉండే వాటితో వ్యాయామం ప్రశాంతంగా సాగకపోగా విరక్తీ కలుగుతుంది. కాబట్టి, మన ఒంటికి నప్పే, సౌకర్యాన్నిచ్చేవి ధరిస్తేనే పూర్తి ధ్యాస పెట్టి వ్యాయామం చేయగలమంటున్నారు నిపుణులు..

టాప్‌ తేలికగా..

శరీరానికి గాలి తగులుతూ బరువు లేకుండా తేలికగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి. వర్కవుట్లు చేసినప్పుడు శరీరం వేడెక్కి, ఒళ్లంతా చెమటలు పడతాయి. కాబట్టి, మన దుస్తులు ఇంకా వేడిని పెంచే రకాలు కాకుండా చూసుకోవడం ప్రధానం. చెమటనీ పీల్చేవిగా ఉండాలి. కాబట్టి.. కాటన్‌ టీషర్టులు, స్పోర్ట్స్‌ బ్రా లాంటివి ఎంచుకోండి.. సౌకర్యంగా అనిపిస్తాయి.

ప్యాంటు..

జిమ్‌ షార్ట్స్‌, ట్రాక్‌, యోగా ప్యాంట్స్‌ లాంటివి సాగే గుణం ఉన్నవి ఎంచుకుంటే మేలు. ఇవి చాలా తేలికగా, హాయిగా ఉంటాయి. చిన్నగా ఉండే షార్ట్స్‌ శరీరాన్ని తేలికగా ఎటు కావాలంటే అటు వంచడానికి సౌకర్యంగా ఉంటాయి. ఒకవేళ ఇంట్లోనే కాదు.. జిమ్‌ కోసమని బయటకు వెళ్లాలి. ఇబ్బందిగా అనిపిస్తే.. యోగా ప్యాంట్లు ఎంచుకోమనండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్