పిల్లలతో నమిలించండి చాలు...

ఒక్కోసారి పిల్లలు సరిగా పళ్లు తోమరు. ఇంకొన్నిసార్లు దంతాల సందుల్లో ఆహార పదార్థాలు ఇరుక్కుపోతుంటాయి. వీటివల్ల దుర్వాసన సమస్యలొస్తాయి.

Updated : 12 Jul 2023 04:37 IST

ఒక్కోసారి పిల్లలు సరిగా పళ్లు తోమరు. ఇంకొన్నిసార్లు దంతాల సందుల్లో ఆహార పదార్థాలు ఇరుక్కుపోతుంటాయి. వీటివల్ల దుర్వాసన సమస్యలొస్తాయి. అలాంటప్పుడు మౌత్‌ఫ్రెష్‌నర్లు వాడకుండా.. ఈ పండ్లూ, పదార్థాలను నమిలించండి. సమస్య దూరమవుతుంది. పళ్లూ మిలమిలా మెరుస్తాయి.

యాపిల్‌: సాయంత్రం పూట ఆకలి వేసినప్పుడు బజ్జీలో, బిస్కెట్లో...తినే  బదులు ఒక యాపిల్‌ని తినమని చెప్పండి. దీంట్లోని మాలిక్‌ యాసిడ్‌ పళ్లని శుభ్రం చేస్తుంది. నోటిని తాజాగా ఉంచుతుంది.

స్ట్రాబెర్రీ, పైనాపిల్‌: ఈ పండ్లలో ఉండే బ్రొమిలీన్‌, విటమిన్‌ సిలు వాసనని దూరం చేస్తాయి.

చీజ్‌, పనీర్‌: వీటిల్లోని క్యాల్షియం, ఫాస్ఫరస్‌లు నోటిలో లాలాజలం ఉత్పత్తి కావడానికి సహకరిస్తాయి. ఫలితంగా బ్యాక్టీరియా తొలగిపోతుంది. దుర్వాసనా ఉండదు.

బాదం: ఇందులోని ప్రత్యేకమైన ప్రొటీన్లూ, కొవ్వులు.. చిగుళ్లూ, దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

పెరుగు: తాజా పెరుగులో బాదం పలుకులూ, కొన్ని స్ట్రాబెర్రీలు కలిపి తినిపించండి. ఇందులోని యాసిడ్లూ, పోషకాలూ పళ్లను శుభ్రం చేస్తాయి. తాజాదనాన్నీ అందిస్తాయి.

నీళ్లు: పిల్లలు ఏం తిన్నా...నీళ్లు తాగడం మరచిపోనివ్వొద్దు. ఎందుకంటే నీరు నోటిలోని యాసిడ్‌ ఉత్పత్తులను నియంత్రణలో ఉంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని