ప్రసవం తర్వాత.. ఆందోళనా?

ప్రసవం తర్వాత తల్లుల్లో హార్మోన్ల అసమతుల్యత వల్ల కోపం, ఆందోళన, ఒత్తిడి వంటివి ఎదురవుతుంటాయి. వీటినెలా అధిగమించాలంటే..

Published : 04 Aug 2023 00:02 IST

ప్రసవం తర్వాత తల్లుల్లో హార్మోన్ల అసమతుల్యత వల్ల కోపం, ఆందోళన, ఒత్తిడి వంటివి ఎదురవుతుంటాయి. వీటినెలా అధిగమించాలంటే..

  • బాలింత కన్పిస్తే చాలు అందరూ తమకి తోచిన సలహాలు ఇస్తారు. వాటిలో కొన్ని ఉపయోగపడేవి ఉన్నా కొన్ని మాత్రం అనవసరపు ఆందోళనను కలిగిస్తాయి. ముఖ్యంగా తినే విషయంలో ఇవి తిను, అవి తినొద్దు అంటూ చెబుతుంటారు. ఏది తింటే ఏమవుతుందో అన్న భయంతో తిండికే దూరమైపోతుంటాం. అందుకే ప్రసవ సమయం నుంచి మీరు సంప్రదిస్తున్న వైద్యులు ఇచ్చిన డైట్‌ను ఫాలో అవ్వండి.
  • ఒకవైపు నొప్పులు బాధిస్తుంటే.. మరోవైపు నవజాత శిశువులు ఏడుపులు వినిపిస్తుంటాయి. మిమ్మల్ని మీరెలా సము దాయించుకోవాలో, వాళ్లనెలా చూసుకోవాలో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. దాంతో మూడ్‌ స్వింగ్స్‌ మొదలవుతాయి. ఇది అందరికి ఎదురయ్యే సమస్యే అని గుర్తుంచుకోండి. పెంపకం అలవాటయ్యేంత వరకూ తప్పదని మీకు మీరే సర్దిచెప్పుకోవాలి.
  • పిల్లలు నిద్రపోయేటప్పుడే, మీరూ నిద్రపోవడానికి ప్రయత్నించండి. దాంతో మీకు నిద్రలేమి ఉండదు. కొత్త ఉత్తేజం వస్తుంది.
  • సాంకేతిక పేరుతో ప్రతిదీ పుస్తకాల్లో, ఫోన్లలో దొరికేస్తుంది. ఈ ఉపాయాలు సాంత్వన ఇస్తే పర్లేదు కానీ కొన్నిసార్లు గందరగోళాన్ని సృష్టిస్తాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండండి.
  • రిలాక్స్‌ అవ్వడం కోసం చాలామంది సినిమాలు చూస్తుంటారు. ఈ సమయంలో భయం, ఆందోళన కలిగించే చిత్రాలకు దూరంగా ఉండటమే మంచిది. హాస్యం ఎక్కువగా ఉండే వాటిని చూడండి. మీరున్న గదిలో చుట్టూ పచ్చదనం ఉండేట్లు చూసుకోండి. మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్