వర్కవుట్లు తప్పనిసరి...

ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు మానసికంగానూ బాగుండాలి. అప్పుడే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు.

Published : 24 Mar 2024 01:31 IST

ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు మానసికంగానూ బాగుండాలి. అప్పుడే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు.

క్రమం తప్పకూడదు: ‘ఇంటి పనిచేస్తున్నాం కదా’ ఇక వ్యాయామం అవసరం లేదంటూ చాలామంది మహిళలు దీనిపై అశ్రద్ధ చూపిస్తుంటారు. కానీ, మన జీవనశైలి ఆరోగ్యంగా సాగాలంటే వర్కవుట్లు తప్పనిసరిగా చేయాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ సమయంలో ఒంట్లో  విడుదలయ్యే ఎండార్ఫిన్‌లు ఒత్తిడిని తగ్గించి, అనారోగ్యాలను దూరం చేస్తాయట. మనల్నీ దృఢంగా మారుస్తాయి. అందుకే క్రమం తప్పకుండా రోజూ ఓ నలభై నిమిషాలు స్థిమితంగా కసరత్తుల కోసం సమయం కేటాయించుకోండి మరి.

సమన్వయం సాధించండి: ఏటికేడు మారుతోన్న జీవనశైలి... ముఖ్యంగా వేగవంతమైన, ఒత్తిడితో కూడుకున్న దినచర్య అనేక అనారోగ్యాలకు కారణం అవుతోంది. వీటిల్లో అధిక రక్తపోటు, మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలు వంటి చాలా రకాలు... మానసిక సమస్యల్ని దీర్ఘకాలం నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చినవే. అందుకే ఆయుర్వేదం... మనసు, శరీర అవసరాల మధ్య సమన్వయం సాధించకుండా నిజమైన ఆరోగ్యాన్ని పొందలేమని చెబుతోంది. ఇందుకు సాత్వికాహారం తీసుకోవడం, ధ్యానం వంటివి తప్పనిసరి అని సూచిస్తోంది.

అవగాహన అవసరం: ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇందుకు కారణాలు ఏమైనా... ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. మితాహారం, నిద్రవేళలు పాటించడం, తగిన విశ్రాంతి, ధ్యానం, యోగా వంటివి భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తినీ, బలమైన రోగనిరోధక వ్యవస్థనూ ఏర్పరుస్తాయి. ఫలితంగా అనారోగ్యాలకు దూరంగా ఉండటమే కాదు... వృత్తి, వ్యక్తిగత పనితీరూ మెరుగుపడుతుంది అంటారు మానసిక నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్