అర్థం చేసుకోండి ప్లీజ్‌!

‘మీరీ మధ్య నన్నసలు పట్టించుకోవడం లేదు’.. అని భార్య అంటే... ‘నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కావు’ అని భర్త. అదే దంపతులు...

Updated : 01 Oct 2021 03:27 IST

‘మీరీ మధ్య నన్నసలు పట్టించుకోవడం లేదు’.. అని భార్య అంటే... ‘నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కావు’ అని భర్త. అదే దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇలాంటి అసంతృప్తులకు తెరపడి కొత్తజీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. అదెలాగో చూడండి.. 

* అవతలివారిలో లోపాలను ఎత్తి చూపి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య వాదనలు మరింత బలపడతాయి. అలాకాకుండా నీకు కాస్త కోపం ఎక్కువ. అది తగ్గించుకోగలిగితే ఇప్పటికంటే మరింత అందంగా కనిపిస్తావ్‌. అంటూ ఇచ్చే సందేశం లోపాలతో పాటు వారి బలాలనూ ప్రస్తావించినట్టు అవుతుంది. ఎందుకంటే అయిన వారికి మార్పులు చెప్పే చనువూ ఉండాలి కదా మరి.

* మీరన్నది నిజమే కావొచ్చు. మీ అభిప్రాయాలు కోరికలు, ఆలోచనలు మనసులోనే ఉంటే తెలిసేదెలా? ఎక్కువ మంది చేసే పొరబాటే ఇది. మనసు మూలల్లో దాచుకున్న విషయాలను అర్థం చేసుకునే శక్తి అందరికీ ఉండకపోవచ్చు కూడా. నాకేదో చేయలేదు అనే బదులు...నాకిది కావాలి అని అడిగి చూడండి. త్వరగానే అవతలి వారు మీ ఇష్టాల్ని గ్రహించగలుగుతారు.

* ఒకరికొకరుగా ఉండాల్సిన బంధంలో... నన్ను పట్టించుకోవట్లేదు, నాకోసం ఏదీ చేయట్లేదు అని ఇద్దరిలో ఒకరు బాధపడుతుంటే! ముందు ఆ అభద్రతకు కారణమేంటో తెలుసుకోండి. సమయం కేటాయించలేకపోవడం, ఇతరులతో పోల్చి చూసుకోవడం వంటివెన్నో ఉండొచ్చు. దాన్ని అధిగమిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్