హద్దులూ.. సరిహద్దులూ

పక్కింటి వారితో అతి చనువూ తప్పే. అసలే మాట్లాడకున్నా కష్టమే. అందుకే ఇరుగు పొరుగుతో చెలిమిని నిలుపుకునే సూత్రాలేంటో చూద్దాం...

Updated : 16 Sep 2022 12:31 IST

పక్కింటి వారితో అతి చనువూ తప్పే. అసలే మాట్లాడకున్నా కష్టమే. అందుకే ఇరుగు పొరుగుతో చెలిమిని నిలుపుకునే సూత్రాలేంటో చూద్దాం...

పొరుగింట్లోకి కొత్తగా వచ్చిన వారిని మీరే పలకరించండి. ఆరోజు సర్దుకోవడంలో హడావుడిగా ఉంటారు కనుక భోజనం ఏర్పాటు చేయండి. మీరే అద్దెకు దిగితే మీరే చొరవ తీసుకుని మాట కలపండి.

* వారి గురించి బాగా తెలిసేంత వరకూ అతి మామూలు విషయాలు మాట్లాడండి. వివాదాస్పదం అనిపించే మాటలొద్దు. అలాంటివి ఎప్పుడూ మంచిది కాదు.

* లోనికి రమ్మంటే దాన్ని హోమ్‌ టూర్‌ అనుకుని ప్రతి గదీ, ప్రతి వస్తువూ చూడాలనుకోకండి. హాల్లోనే రెండు మాటలు మాట్లాడి వచ్చేయండి.

* ప్రతి ఒక్కరూ కాస్త గోప్యత కోరుకుంటారు కనుక వ్యక్తిగత విషయాలను ఆరా తీయకండి. అడిగితేనే సలహాలు ఇవ్వండి. మీ సొంత విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం కూడా ఇవ్వకండి.

* మీ కుటుంబసభ్యుల చెప్పులు ఎదురింటి వరకూ పాకకుండా చూడండి. ప్రతిదానికీ హద్దులూ సరిహద్దులూ ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్