ప్రేమతో జయించొచ్చు
close
Updated : 11/11/2021 06:36 IST

ప్రేమతో జయించొచ్చు

మల్లిక తొమ్మిదేళ్ల కొడుకుపై చుట్టుపక్కల వాళ్లంతా ఫిర్యాదులే. ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నాడని, తన మాట వినకపోతే కొడుతున్నాడని అందరూ తలా మాట అంటుంటే ఆమెకు ఆవేదన కలుగుతోంది. కొడుకును మార్చడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇలాంటి చిన్నారుల్లో మార్పు తేవాలంటే ప్రేమతోనే వారి మనసును జయించాలంటున్నారు మానసిక నిపుణులు.

* ఇంటి వాతావరణం... చిన్నారుల ప్రవర్తనకు అద్దంలాంటి వారు తల్లిదండ్రులు. తనముందు అమ్మా నాన్నలు, తోబుట్టువులు ఎలా నడుచుకుంటున్నారో పరిశీలిస్తుంటారు పిల్లలు. దాన్ని అనుసరిస్తూ బయట కూడా అలాగే వ్యవహరిస్తుంటారు. చిన్నారులకు మంచి లక్షణాలు అలవడాలంటే ముందుగా ఇంటి వాతావరణాన్ని మర్యాద పూర్వకంగా, ప్రేమగా ఉంచుకోవాల్సిన బాధ్యత పెద్దవారిదే.
* ప్రశంస... ఇంట్లో పిల్లలు బెదిరిస్తూ, పెద్దవారిని కొట్టడం, చెయ్యెత్తడం వంటివి చేస్తే నవ్వుతూ మురిసిపోకుండా, వెంటనే ఖండించాలి. లింగ వివక్ష లేకుండా పిల్లలందరినీ సమానంగా చూడటం నేర్పాలి. తోబుట్టువులతో ప్రేమగా ఉండాలని మృదువుగా చెప్పాలి. పెద్దాచిన్నా తేడా వారికి నేర్పాలి. మర్యాదపూర్వకమైన వ్యవహారశైలిని చిన్నప్పటి నుంచి అలవరిస్తే, ఇంట్లోనే కాదు, బయట కూడా చిన్నారులు దాన్ని పాటిస్తారు.
* ఒకరిపై మరొకరు
ఇంట్లో పెద్దవాళ్లు తమ మాటే నెగ్గాలనే పంతంతో ఒకరిపై మరొకరు అరుచుకోవడం, కోప్పడటం వంటివి పిల్లలు గ్రహిస్తారు. నాన్న అరిచి, బెదిరిస్తేనే అమ్మ వింటోంది అనే భావన వారి మనసులో మొదలవుతుంది. అంతేకాదు, అదే సరైన విధానమని పొరపాటుపడతారు. బయట తాము కూడా అలాగే ప్రవర్తిస్తారు. బెదిరిస్తే గెలుపు సొంతమవుతుందనే ఆలోచనావిధానాన్ని పాటించడం మొదలుపెడతారు. అలాకాకుండా పిల్లలకు పెద్దవాళ్లు స్ఫూర్తిగా నిలవాలి. చిన్నారులిలా ఉండాలి అని కలలు కనేముందు, తల్లిదండ్రులు అలాగే ఉండటం నేర్చుకోవాలి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని