ఆ మూడూ వదిలేయండి..

భార్యాభర్తలన్నాక ఏదో విషయంలో ఎప్పుడో ఒకప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సహజం. ఒక్కోసారి గట్టిగా గద్దించినట్లు మాట్లాడినా.. అది క్షణికావేశం మాత్రమే.

Published : 05 Jun 2023 00:09 IST

భార్యాభర్తలన్నాక ఏదో విషయంలో ఎప్పుడో ఒకప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సహజం. ఒక్కోసారి గట్టిగా గద్దించినట్లు మాట్లాడినా.. అది క్షణికావేశం మాత్రమే. ఆ సందర్భం దాటగానే వాతావరణం మామూలైపోతుంది. అందుకే అది ఆత్మీయ బంధం. ఒకరు లేనిదే రెండోవారు లేనట్టే ఉంటుంది. ఆ ప్రేమ ఇంకిపోకుండా జీవితాంతం కొనసాగాలంటే కొన్ని సూత్రాలు పాటించమంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు...

ఆశలు కుదించుకోవాలి... భాగస్వామి నుంచి అతిగా ఆశిస్తున్నారా? పుట్టిన రోజుకు భారీ కానుక ఇవ్వాలి, దేశవిదేశాలకు పర్యటనకు తీసుకెళ్లాలిలాంటి కోరికలు తీరడంలేదా? అవేమీ దురాశలు కాదు, నిజమే. కానీ సెలవు రీత్యా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక్కోసారి కుదరకపోవచ్చు. అనుకున్నది సాధ్యం కానంతలో నిరాశా నిస్పృహలకు గురికావద్దు. ఇచ్చింది చిరు కానుకైనా అందులో ఉన్న ఆత్మీయతను ఒడిసిపట్టుకోండి. వీలైనంత బడ్జెట్‌లో అవకాశం ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆనందంగా గడపండి.

చిరాకులూ పరాకులూ... పనులూ బాధ్యతలతో అలసిపోతున్నారా? ఈ భారం మోయలేకపోతున్నానంటూ విసుక్కుంటున్నారా? పైగా ‘మన అశాంతి భాగస్వామి మీదే చూపగలం కానీ పక్కింటి వాళ్ల మీద కాదుగా’ అనుకుంటున్నారా?! కానీ తరచుగా కోపతాపాలు చూపితే పర్యవసానంగా అవతలి వ్యక్తికీ అసహనం కలుగుతుంది. అప్పుడిక గొడవలూ ఘర్షణలూ తప్పవు. అందుకే నెమ్మదించండి. కోపానికి బదులు మీ బాధను, అంతర్మథనాన్ని వ్యక్తం చేయండి. పనుల్లో సాయం కావాలని అడగండి. చేయూత దొరుకుతుంది, ప్రశాంతత చేకూరుతుంది.

పెళ్లి తర్వాతా ప్రేమ... భార్యాభర్తలంటే ఒకర్నొకరు నిందించుకోవడం, నిష్టూరాలాడటం ఉంటూనే ఉంటుంది.. ప్రేమికులకు మల్లే సరససల్లాపాలు కుదరదులే.. అనేవాళ్లూ ఉన్నారు. కొన్ని జంటల్ని చూస్తే అది నిజమే అనిపించినా వాళ్లనే ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? పెళ్లయ్యాక ప్రేమెందుకు ఉండదు? పెళ్లి కోసం ఆత్మీయతను తాకట్టు పెట్టాలా ఏంటి? కనుక అదేం అసాధ్యం కాదు. ఆధిపత్యం చెలాయించడం, అవమానించడం, అవహేళన చేయడం అనే మూడు లక్షణాలను వదిలించుకోండి చాలు.. ఎంచక్కా అన్యోన్యంగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్