మెప్పు పొందడం మంచిదే కానీ...

ఇల్లాలిగా ఇంటి బాధ్యతలపై పట్టు మీకు ఉండొచ్చు. అయితే మితిమీరిన భారం ఎవరినైనా ఒత్తిడికి గురిచేస్తుంది. ఇది మరింత పెరిగితే.... ‘అన్నీ నేనే ఒంటరిగా చేసుకుంటున్నాననే’ భావన మిమ్మల్ని వెంటాడుతుంది.

Published : 07 Jun 2023 00:05 IST

ఇల్లాలిగా ఇంటి బాధ్యతలపై పట్టు మీకు ఉండొచ్చు. అయితే మితిమీరిన భారం ఎవరినైనా ఒత్తిడికి గురిచేస్తుంది. ఇది మరింత పెరిగితే.... ‘అన్నీ నేనే ఒంటరిగా చేసుకుంటున్నాననే’ భావన మిమ్మల్ని వెంటాడుతుంది. ఇది క్రమంగా కుంగుబాటుకి గురిచేస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే... 

* అన్నింట్లోనూ పర్‌ఫెక్ట్‌ అనిపించుకోవడానికి మహిళలు కాస్త ఎక్కువ తాపత్రయ పడుతుంటారు. దాంతో అన్ని పనులూ నెత్తిన వేసుకుని అందరినీ మెప్పించాలనుకుంటారు. అలాగని ‘అన్ని బాధ్యతల్నీ సక్రమంగా పూర్తిచేయడం అంత సులువేమీ కాదు. వాటిని ఒత్తిడిలేకుండా నిర్వర్తించినప్పుడే...ఆ పొగడ్తకి అర్హులు’ అంటారు మానసిక నిపుణులు. అందుకోసం మీరు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అప్పుడే అది సాధ్యం.

* ప్రణాళికాబద్ధంగా ఏ పని చేసినా సులభంగానే మీ లక్ష్యం పూర్తవుతుంది. అయితే, వంట మొదలుకుని దుస్తుల వరకూ అన్నింటా ఇది అమలయ్యేలా చూసుకోండి. అలాగని వాటన్నింటినీ మీరొక్కరే చేయాలనుకోవడం వల్ల ఎవరినీ సంతృప్తి పరచలేరు. పని విభజనతో ఎవరి పనులు వారు సక్రమంగా చేసుకునేలా చేయగలిగితేనే మీరు విజయం సాధించినట్లు.

* మల్టీ టాస్కింగ్‌ వినడానికి బాగానే ఉంటుంది. వాస్తవంలో అందుకు దూరమేనంటున్నాయి చాలా అధ్యయనాలు. ఈ తీరు తీవ్ర ఒత్తిడిని కలుగచేస్తుంది. నాణ్యతా దెబ్బతింటుంది. అంతేకాదు, ఒక్కోసారి ఏదీ సరిగా చేయలేక ఇబ్బంది పడే అవకాశమూ ఉంది. వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తే ఈ ఇబ్బంది అధిగమించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని