ఆమెది ఆత్మరక్షణోద్యమం!

మహిళలకోసం ఎన్ని చట్టాలున్నా ఇంకా భద్రత కరవే. ఇంట్లో గృహహింస, బయట లైంగిక వేధింపులు. అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా నిర్భయంగా వెళ్లలేని స్థితి.

Published : 07 Jul 2021 00:47 IST

మహిళలకోసం ఎన్ని చట్టాలున్నా ఇంకా భద్రత కరవే. ఇంట్లో గృహహింస, బయట లైంగిక వేధింపులు. అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా నిర్భయంగా వెళ్లలేని స్థితి. ఈ పరిస్థితిని మార్చే యత్నంలో గిన్నిస్‌ రికార్డుకెక్కిన ధీరవనిత అపర్ణ...

పర్ణ రజావత్‌ తొమ్మిదేళ్ల వయసులోనే కరాటే ఛాంపియన్‌షిప్‌ సాధించింది. ఆట పాటలంటేనూ సరదా. ఇంట్లో మాత్రం బోల్డన్ని ఆంక్షలు. ఒక్కోసారి దొంగచాటుగా ఆడేది. చాలాసార్లు మారు వేషంలో అబ్బాయిల పోటీల్లో పాల్గొనేది. వయసు పెరిగేకొద్దీ స్త్రీపురుష వివక్ష బాగా తెలిసొచ్చింది. అత్యాచారాల్లాంటి దారుణాల గురించి విన్నప్పుడల్లా తన మనసు భారమయ్యేది. ఇలాంటి వెతలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే అమ్మాయిలు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి అనుకున్న అపర్ణ ‘పింక్‌ బెల్ట్‌ మిషన్‌’ ఆరంభించింది. మార్షల్‌ ఆర్ట్స్‌లో 16 సార్లు అంతర్జాతీయ మెడల్స్‌ సాధించిన ఆమె స్త్రీలకు ఆత్మరక్షణ శిక్షణను ఉద్యమంలా చేస్తోంది.

స్త్రీలు ధైర్యంగా, స్థైర్యంగా ఉంటూ చట్టాల గురించి అవగాహన పెంచుకున్నప్పుడే తమను తాము రక్షించుకోగలరు అంటుందామె. ఆమె మహిళా సాధికారత గురించి మాట్లాడితే చుట్టుపక్కల వాళ్లు ఎగతాళి చేసేవారు. డబ్బు కోసమో, రాజకీయాల్లో చేరడానికో ఈ ఎత్తుగడ అనేవారు. స్కూళ్లూ యూనివర్సిటీల్లో వర్క్‌షాపులు నిర్వహించడానికి అనుమతి వచ్చేది కాదు. అయినా తను ఆగలేదు. నిస్స్వార్థంగా, నిజాయితీగా పనిచేస్తోందని అర్థమయ్యాక వాళ్లే నీరాజనాలు పలికారు.

అపర్ణ అతి ఎక్కువ మంది స్త్రీలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌లో శిక్షణ ఇచ్చి గిన్నిస్‌ రికార్డ్‌ సాధించింది. హాలివుడ్‌ దర్శకుడు జాన్‌ మెక్‌ క్రైట్‌ అపర్ణ జీవితంపై ‘ది పింక్‌ బెల్ట్‌ మిషన్‌’ అనే చిత్రాన్ని రూపొందించాడు. ‘నా జ్ఞానం, నైపుణ్యాలూ అన్నీ సమాజ బాగు కోసమే. మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలనేదే నా సంకల్పం. నా లక్ష్యం’ అంటుందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్