ఆమె గణపతి.. పేదల ఆకలి తీరుస్తాడు!

మానవసేవకి మించిన మాధవసేవ లేదన్నది రింతూ కల్యాణి రాథోడ్‌ నమ్మకం.  తొమ్మిదేళ్లుగా ఆమె చేతుల్లో తయారవుతున్న చాక్లెట్‌ వినాయకుడు, పాయసం గణపతులు పేదల ఆకలిని తీరుస్తూ.. పర్యావరణానికి ఎలా మేలు చేస్తున్నాయో చూద్దాం!

Published : 31 Aug 2022 00:32 IST

మానవసేవకి మించిన మాధవసేవ లేదన్నది రింతూ కల్యాణి రాథోడ్‌ నమ్మకం.  తొమ్మిదేళ్లుగా ఆమె చేతుల్లో తయారవుతున్న చాక్లెట్‌ వినాయకుడు, పాయసం గణపతులు పేదల ఆకలిని తీరుస్తూ.. పర్యావరణానికి ఎలా మేలు చేస్తున్నాయో చూద్దాం!

ముంబయిలోని జుహూ బీచ్‌లో ఉదయపు నడక అంటే ప్రాణం  రింతూకి. కానీ ‘గణేశ నిమజ్జనాల తర్వాత బీచ్‌లో ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉండే వినాయక బొమ్మలని చూస్తే బాధేస్తుంది’ అనే రింతూ దీనికోసం చక్కని ఆలోచన చేసింది. పర్యావరణానికి హానిచేయకుండా చాక్లెట్‌తో బొమ్మను తయారుచేసింది. పదోరోజు ఆ ప్రతిమని పాలల్లో కలిపి ఆ ప్రసాదాన్ని ముంబయిలోని అనాథశ్రమాల్లో పంచేసింది. అది మొదలు ఏటా చాక్లెట్‌ గణేశుణ్ని తయారుచేస్తూ అందరి ప్రశంసలూ అందుకుంటోంది. వృత్తిరీత్యా బేకర్‌ అయిన రింతూ కొడుకు పుట్టగానే వాడి ఆలనాపాలనా చూడ్డానికని ఆ పనికి దూరమైంది. కానీ ఎవరూ ఆకలితో పస్తులుండకూడదనేది రింతూ అభిప్రాయం. అందుకే ఫుడ్‌ఆర్మీ అనే ఎన్జీవోని ప్రారంభించి... తోటి గృహిణులతో కలిసి పేదలకు, అవసరంలో ఉన్నవారికి ఆహార పంపిణీ చేసేది. అపార్ట్‌మెంటుల్లో ఖరీదైన విగ్రహాలకి బదులు.. కప్‌కేకులతో గణేశ బొమ్మలు చేసి వాటిని పిల్లలకు అందించేది.

ఇప్పుడు కొత్తగా ఖీర్‌ గణేశుణ్ని కూడా రూపొందించి... దాని తయారీపైనా ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. ఇలా అయినా కాలుష్యాన్ని తగ్గించవచ్చు అనేది ఆమె ఆలోచన.

‘మన దేవాలయాల్లో క్షీరాన్నాన్ని ప్రసాదంగా ఇస్తారు. అది చూశాకే నాకు పాయసం (ఖీర్‌) గణపతిని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. చాక్లెట్‌తో పోలిస్తే ఈ వినాయకుడి తయారీకి ఎక్కువ సమయం పట్టింది. పాలపొడి, బియ్యపురవ్వ, ఇలాచీ, డ్రైఫ్రూట్స్‌, పంచదార, కుంకుమపువ్వు వాడి చాలా ప్రయోగాలు చేశాను. విగ్రహం ఆ రూపు దాల్చడానికి నాకు సుమారుగా తొమ్మిదినెలలు పట్టింది. పూజ తర్వాత నిమజ్జనం రోజు ఈ బొమ్మను పాలల్లో ముంచితే చాలు. పాయసం సిద్ధమవుతుంది. దానిని అనాథ పిల్లలకు పంచేస్తుంటాను.

ఇంతవరకూ వెయ్యిమందికి చాక్లెట్‌ వినాయకుడి తయారీని నేర్పించాను. ఇప్పుడా వర్క్‌షాపుల్లో ఖీర్‌ గణపతి తయారీ నేర్పించాలనుకుంటున్నా అంటోంది రింతూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్