నగలను భద్రపరచండిలా!

వెండి నగలు: వాతావరణలోని తేమ వల్ల ఈ నగలు త్వరగా నల్లగా మారతాయి. కాబట్టి వీటిని ఎప్పుడూ పొడిగా ఉండేలా ఓ బాక్సులోనో, జిప్‌లాక్‌ బ్యాగులోనో భద్రపరచాలి.  ఇవి మునుపటిలా మెరుపులీనాలంటే... టూత్‌పేస్ట్‌తో తుడవాలి.

Published : 04 Sep 2021 02:24 IST

వానాకాలం జోరు కొనసాగుతోంది. పెళ్లిళ్లూ, వేడుకలూ కూడా అదేస్థాయిలో జరుగుతున్నాయి.. మరి ఈ సందర్భాల్లో వేసుకునే నగలను ఎలా జాగత్త్రగా భద్రపరుచుకోవాలో తెలుసుకుందామా..

వెండి నగలు: వాతావరణలోని తేమ వల్ల ఈ నగలు త్వరగా నల్లగా మారతాయి. కాబట్టి వీటిని ఎప్పుడూ పొడిగా ఉండేలా ఓ బాక్సులోనో, జిప్‌లాక్‌ బ్యాగులోనో భద్రపరచాలి.  ఇవి మునుపటిలా మెరుపులీనాలంటే... టూత్‌పేస్ట్‌తో తుడవాలి.

బంగారం- ప్లాటినం... ఈ నగలను వాడిన తర్వాత ప్రతిసారి శుభ్రం చేసి భద్రపరచాలి. వంటసోడా, టూత్‌పేస్ట్‌ కలిపి మృదువైన బ్రష్‌తో రుద్దితే చాలు మునుపటిలా మెరుస్తాయి లేదా గోరువెచ్చని లిక్విడ్‌ సోప్‌లో వేసి శుభ్రం చేస్తే సరి. అలాగే తడి పూర్తిగా పోయేలా తుడిచి, గాలికి ఆరనివ్వాలి. మస్లిన్‌ వస్త్రంలో చుట్టి ఓ బాక్స్‌లో పెట్టేయాలి. బంగారాన్ని ఇతర నగలతో కలిపి పెట్టొద్దు.

డైమండ్స్‌... వీటిని సోప్‌ వాటర్‌తో శుభ్రం చేయొచ్చు లేదా మృదువైన వస్త్రంతో తుడిస్తే సరి. దుమ్ము, ధూళి అంతా పోతాయి.

ముత్యాలు- జెమ్‌స్టోన్స్‌:  ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని సరిగా భద్రపరచకపోతే గీతలు పడతాయి. కాబట్టి వీటిని ఉపయోగించిన తర్వాత మృదువైన పర్సులు,  ప్లాస్టిక్‌ రేపర్లలో ఉంచొచ్చు. అలాగే ఇతర ఆభరణాలతో వీటిని కలపొద్దు. రంగురాళ్లను నగలనీ విడిగానే ఉంచాలి. వీటిని మృదువైన వస్త్రంతో తుడిస్తే చాలు దుమ్ము తొలగిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్