కనిపించకుండానే..

ఇంట్లో అలంకరణలు ఎంత బాగున్నా స్విచ్‌ బోర్డులు వంటివి గది గోడల అందాన్ని తగ్గిస్తాయి. ఇలాంటివే మరికొన్ని సమస్యలున్నాయి. వీటన్నింటికీ సృజనాత్మకతతో పరిష్కారం చూపిస్తున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు...

Published : 22 Jul 2022 01:45 IST

ఇంట్లో అలంకరణలు ఎంత బాగున్నా స్విచ్‌ బోర్డులు వంటివి గది గోడల అందాన్ని తగ్గిస్తాయి. ఇలాంటివే మరికొన్ని సమస్యలున్నాయి. వీటన్నింటికీ సృజనాత్మకతతో పరిష్కారం చూపిస్తున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు...

వాల్‌పేపర్లలా.. గోడపై వాల్‌పేపర్‌లా అనిపించే ఈ బోర్డు వెనుక స్విచ్‌ల ఏర్పాటు ఉంటుంది. ఇంటి కరెంటుకు సంబంధించిన వైర్లన్నీ ఇందులోనే ఉంటాయి. పైకి గోడపై అలంకరణగా మనసుకు నచ్చిన ప్రకృతి దృశ్యాలు, పూలు, ఫొటో ఫ్రేములు వంటివి ఫిక్స్‌ అయ్యేలా ఈ బోర్డులుంటాయి. చూడటానికి అలంకరణగానే ఉన్నా.. అవసరమైనప్పుడు వీటిని తెరిచి మూసుకోవచ్చు.

మొక్కలుంచి.. వైఫై రౌటర్‌తో టీవీ లేదా ముందు గదిలో టేబుల్‌పై వైర్లన్నీ చెత్తగా కనిపిస్తాయి. ఎంత సర్దినా వాటి వెనుక మురికి, దుమ్ము, ధూళి చేరి గది అందాన్నే తగ్గిస్తాయి. వీటికోసం ప్రత్యేకంగా గోడకు అమరి పోయే బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. దీనికి బయటివైపు కిటికీ డిజైన్‌లా ఉంటుంది. దీనికి చిన్న స్టాండులా చేసి రెండు మూడు ఇండోర్‌ మొక్కలను సర్దితే చాలు. డిజైన్‌లా అనిపించే ఈ ఏర్పాటు వెనుక వైఫై ఉందని తెరిస్తేనే తెలుస్తుంది. అవసరమైనపుడు బయటి వైపు తలుపు తీసే సౌలభ్యం ఉంటుంది.

పడకగదిలో.. గోడకి అందమైన అద్దం కనిపిస్తే, అదొక్కటే ఉందని అనుకోకండి. దాని వెనుకే గోడకు అమర్చిన చిన్న బోర్డులో యాక్ససరీస్‌ అమర్చుకునే ఏర్పాటు కూడా ఉండొచ్చు. అందమూ, సౌకర్యమూ రెండింటినీ మేళవించి చేస్తున్న ఈ ఫర్నిచర్‌ బాగుంది కదూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్