గదిలో పచ్చని నిచ్చెన ..

ఎత్తైనచోట్లకు వినియోగించే నిచ్చెనను ఇంటి అందంలోనూ భాగం చేయొచ్చు. అదెలాగో ఇంటీరియర్‌ నిపుణులు చెబుతున్నారిలా.

Published : 01 Feb 2023 00:21 IST

ఎత్తైనచోట్లకు వినియోగించే నిచ్చెనను ఇంటి అందంలోనూ భాగం చేయొచ్చు. అదెలాగో ఇంటీరియర్‌ నిపుణులు చెబుతున్నారిలా.

చెక్క లేదా ఇనుప నిచ్చెనను ముందుగది, కారిడార్‌, బాల్కనీలో గోడకు ఆనించేలా ఏర్పాటు చేయాలి. చిన్నచిన్న ఇనుప కొక్కీలను వరసగా నిచ్చెన మధ్యలో ఉన్న ఊసలు లేదా చెక్కలకు తగిలించాలి. తాళ్ల మధ్యలో ఉంచిన ఇండోర్‌ ప్లాంట్‌ తొట్టెలను ఈ కొక్కీలకు తగిలిస్తే చాలు. పాకే మొక్కలైతే నిచ్చెనకు పాకుతూ కొత్తగా అందంగా కనిపిస్తాయి.

బల్లపై.. బాల్కనీ, వీధి వరండాలో స్థలమంతా ఖాళీగా అనిపించినప్పుడు ఇలా నిచ్చెనతో ఆ ప్రాంతాన్నంతా అందంగా మార్చుకోవచ్చు. పొడవైన చెక్క నిచ్చెనను ఓ మూలన ఉంచి, ఫిలోడెండ్రాన్‌ లేదా మనీప్లాంట్‌ ఉంచిన తొట్టెను నిచ్చెన కింది మెట్టు వద్ద ఉంచాలి. పాకడానికి వీలుగా ఆ మొక్కను అక్కడక్కడా తాడు లేదా ఇనుపతీగతో నిచ్చెనకు అనుసంధానం చేయాలి. అది పూర్తిగా నిచ్చెనంతా పాకి చూడటానికి అందంగా ఉంటుంది. అలాగే భోజనబల్ల లేదా హాల్‌లోని టేబుల్‌పైన వేలాడేలా నిచ్చెన ఏర్పాటు కూడా ఇంటికి కొత్త అందాన్నిస్తుంది.

పచ్చగా.. స్నానాలగది పక్కగా పచ్చదనం పరుచుకోవాలన్నా నిచ్చెనపై  ఇండోర్‌ మొక్కలను సర్దేస్తే చాలు. తగిలించుకోవడానికి వీలుగా వస్తున్న తొట్టెల్లో మట్టి నింపి ఫెర్న్‌, మనీప్లాంట్‌ వంటివి నాటాలి. ఇటువంటి చోట చిన్నగా ఉండే నిచ్చెనను ఎంచుకోవాలి. దీని మధ్య చెక్కకు తొట్టెలను తగిలించాలి. వీటిలో పాకే వాటిని, మామూలుగా పెరిగే ఇండోర్‌ ప్లాంట్స్‌ను కలిపి ఉంచాలి. ఇవి పెరుగుతున్నప్పుడు ఆ చోటంతా పచ్చగా మధ్యలో నిచ్చెన కనిపిస్తూ ఆకర్షణీయంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్