వేడిని తగ్గించే కర్టెన్లు
ఎండలు మండిపోతున్నాయి. ఆ వేడంతా కిటికీలు, తలుపుల ద్వారా ఇంట్లోకి చొరబడుతుంది. దాన్ని అడ్డుకునేందుకు ఉపశమనంగా కర్టెన్లనూ వాడొచ్చు. మరి ఈ వేడికి ఎలాంటి ఫ్యాబ్రిక్ మంచిదో చూద్దామా..
ఎండలు మండిపోతున్నాయి. ఆ వేడంతా కిటికీలు, తలుపుల ద్వారా ఇంట్లోకి చొరబడుతుంది. దాన్ని అడ్డుకునేందుకు ఉపశమనంగా కర్టెన్లనూ వాడొచ్చు. మరి ఈ వేడికి ఎలాంటి ఫ్యాబ్రిక్ మంచిదో చూద్దామా..
కాటన్‌తో.. కర్టెన్లు అనగానే పాలియస్టర్‌వి ఎంచుకుంటారు. శుభ్రం చేయడానికి తేలికగా ఉంటుందని, తొందరగా మురికి కూడా పట్టవని. అయితే, దీన్ని మిగిలిన కాలాల్లో ఉపయోగించినా వేసవిలో మాత్రం కాటన్‌కు ప్రాధాన్యమివ్వండి. గది అంతా చల్లగా ఉంటుంది. బయటి వేడిని తొందరగా లోపలికి రానివ్వదు. కాటన్‌లోనూ లేత రంగులయితేనే మంచిది. వేడిని గ్రహించవు.
మ్యాట్‌లు.. కిటికీలకు బయటి నుంచి వెదురుతో చేసిన మ్యాట్‌లు తగిలించొచ్చు. అవి వేడిని లోపలికి రాకుండా ఆపుతాయి. రాత్రి సమయంలో వాటిని పైకి కట్టేసుకోవచ్చు. ఉదయం ఎండ మొదలవగానే వాటిని కిందకి లాగేస్తే సరి.
జనపనారతో.. ఇప్పుడు జనపనార మ్యాట్‌లు దొరుకుతున్నాయి. వాటిని బయటినుంచి తగిలిస్తే సరి. వాటిని మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో తడుపుతూ ఉండాలి. కిటికీలకి అల్లుకునే మొక్కల్లాంటివి పెంచుకున్నా స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించొచ్చు. ఆహ్లాదకరంగానూ ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.