Published : 15/07/2021 00:42 IST

ప్రేమిస్తే... పనిచేయొచ్చు!

ఉద్యోగం చేసే మహిళలు చాలాసార్లు కుటుంబానికి సమయం కేటాయించ లేకపోతున్నామని చెబుతుంటారు. మొదట్లో కాస్త సమయం కేటాయించి సర్దుబాట్లు చేసుకుంటే... క్రమంగా సులువవుతుంది అంటున్నారు నిపుణులు.

ప్రణాళిక కావాలి... పనిభారం తగ్గి, ఎక్కడి పనులు అక్కడే పూర్తిచేయాలంటే మీకంటూ కొంత ప్రణాళిక ఉండాలి. అంటే.. మర్నాడు చేయాల్సిన పనుల్ని ముందురోజే ఆలోచించుకోవడం, అందుకు అవసరమైనవి సిద్ధం చేసుకోవడం వల్ల కొంత సమయం కలిసొస్తుంది. అది పని భారాన్ని తగ్గిస్తుంది.

పనిని ప్రేమించండి: మీ ఉద్యోగమైనా, వ్యాపారమైనా... ముందు మీ పనిని మీరు ప్రేమించాలి. ఎందుకంటే... అయిష్టత, నిరాసక్తత ఒత్తిడిని పెంచుతాయి. ఉత్పాదకతను తగ్గిస్తాయి. తర్వాత ఇంటికీ, కార్యాలయానికీ మధ్య పని విభజన చేసుకోవడంతో పాటు... పరిధినీ నిర్ణయించుకోండి. ఆఫీసులో గడువులోగా పనులు ముగించుకోవడం, ఇంటి బాధ్యతల్ని ఆఫీసుకి తీసుకురాకపోవడం వంటి వాటివల్ల మీ టైమ్‌ సద్వినియోగమవుతుంది.

ఫోన్లకు దూరంగా: మీకున్న సమయంలోనే... పిల్లలు, కుటుంబ సభ్యులతో గడిపేటప్పుడు... ఫోన్‌లు, ఇతరత్రా అంశాలపైకి మనసు పోనివద్దు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. అప్పుడు మీరు వారితో నాణ్యమైన సమయాన్ని గడిపిన భావన వస్తుంది. మీ మనసు తేలికపడుతుంది. ఉత్సాహంగానూ ఉండ గలుగుతారు.

మీకోసం మీరు: ఇతరత్రా రోజులు ఎలా గడిచిపోయినా... సెలవు రోజున కచ్చితంగా ఓ గంట మీకోసమే కేటాయించుకోండి. అవసరాన్ని బట్టి దాన్ని పెంచుకోండి. తోటపని, బొమ్మలు గీయడం, సంగీతం వినడం వంటి అభిరుచుల కోసం కేటాయించుకోండి. ఇవి మీలో నూతనోత్తేజాన్ని తెస్తాయి. వీటితో పాటూ చర్మ, కేశ సంరక్షణపై దృష్టిపెట్టడం, తగినంత నిద్రపోవడం మరిచిపోవద్దు. ఇవి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి