మొదటి ప్రశ్నకు సిద్ధమేనా?

ఇంటర్వ్యూ అనగానే సబ్జెక్టు పుస్తకాలన్నీ ముందేసుకుని తిరగేస్తుంటాం కదా! మరి మొదటిది.. అదేనండీ.. ‘మీ గురించి చెప్పండి!’ అనే ప్రశ్నకు సిద్ధమయ్యారా? దానిదేముంది అనుకున్నారో.. ఇబ్బందిలో పడ్డట్టే అంటున్నారు నిపుణులు.

Published : 22 May 2022 01:27 IST

ఇంటర్వ్యూ అనగానే సబ్జెక్టు పుస్తకాలన్నీ ముందేసుకుని తిరగేస్తుంటాం కదా! మరి మొదటిది.. అదేనండీ.. ‘మీ గురించి చెప్పండి!’ అనే ప్రశ్నకు సిద్ధమయ్యారా? దానిదేముంది అనుకున్నారో.. ఇబ్బందిలో పడ్డట్టే అంటున్నారు నిపుణులు.

* ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థి కంగారు పడుతుంటాడు. తనలో భయాన్ని పోగొట్టడానికి ఇలా ప్రారంభిస్తారనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. కానీ కాదనేది నిపుణుల మాట. రెజ్యూమెలో అప్పటికే మీ గురించిన సమాచారం ఉంటుంది. అయినా ఎందుకు అడుగుతున్నారు? అంటే మీ నుంచి అదనంగా ఏదో ఆశిస్తున్నట్టే కదా! కాబట్టి.. రెజ్యూమెలో ఉన్నదాన్నే అప్పజెప్పేయకండి.

* ఫలానా కళాశాలలో చదివాను, లేదా సంస్థలో పనిచేశాను అని చెప్పడంలో వాటి పేర్లు మినహా మీ గురించి ఏం తెలుస్తుంది? కాబట్టి, దానిలో ప్రవేశానికి కష్టపడ్డ తీరో, దానిలో నేర్చుకున్న అంశాలు, సాధించిన విజయాలు.. వంటి వాటికి చోటివ్వాలి. పేరుకు అనుభవాలు చెబుతున్నట్లున్నా మీ తీరు, నైపుణ్యాలను చెప్పే మార్గమిది. పోటీతత్వం, నిబద్ధత, పరిస్థితులకు అనుగుణంగా మారే తీరు.. సంస్థలు అభ్యర్థుల్లో ప్రధానంగా చూసే అంశాలు. వీటికి సమాధానమూ మీరు చెప్పే దానిలో దొరకాలి.

* మీ వ్యాపకాలూ.. ఉద్యోగానికి జత కుదిరేట్టు ఉండాలి. మొత్తంగా సంస్థ ఆశిస్తున్న దానికీ, మీ నైపుణ్యాలు సరిపోతాయన్న భావన కల్పించాలి. ఇదంతా అప్పటికప్పుడు ఆలోచించడం కుదురుతుందా? లేదు కదా! కాబట్టి, ఏం చెప్పాలి? ఏ ప్రశ్నలు వచ్చే అవకాశముంది రీతిలో మీ సన్నద్ధత సాగేలా చూసుకోండి. చివరగా.. వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ సమాచారమిచ్చేలా చూసుకుంటే.. విజయానికి ప్రథమ, అసలైన మెట్టు ఎక్కేసినట్టే! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్